బాలిక స్కూల్‌ డ్రెస్‌పై అభ్యంతరం: తండ్రి ‘సోషల్‌’ నిరసన

Minor Student Sent Back To Home For Her Dress Looks Lingerie Outfit - Sakshi

ఒట్టావా: ఓ మైనర్‌ విద్యార్థిని దుస్తులు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని ఆరోపించి బాలికను ఇంటికి పంపించిన ఘటన కెనడాలో చోటు చేసుకుంది. దీనిపై ఆమె తండ్రి ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాడు. అంతేగాక తనకు, తన కూతురికి మద్దతుగా నిలవాలంటూ సోషల్‌ మీడయాలో పోస్టు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాలు.. ​కెనడాలోని నోర్కమ్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్లో క్యారిస్‌ అనే విద్యార్థిని చదువుతోంది. ఈ క్రమంలో ఆమె ఇటీవల వైట్‌ ఫుల్‌ లెన్త్‌ స్లీవ్‌, పొడవాటి నెక్‌ షర్ట్‌పై బ్లాక్‌ సింగిల్‌ స్ట్రీప్‌, మెకాలి పోడవు ఉన్న లేస్‌ టాప్‌ ధరించి స్కూల్‌కు వెళ్లింది.

దీంతో క్లాస్‌లో ఓ మహిళా ఉపాధ్యాయురాలు తన మిగతా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేల ఉందని, పాఠాలు చెప్పే సమయంలో ఉపాధ్యాయులంతా ఏకాగ్రత కోల్పోయే విధంగా తన ఆమె దుస్తులు ఉన్నాయని విద్యార్థినితో పేర్కొంది. అంతేగాక క్యారిస్‌నున స్కూల్‌ ప్రిన్సిపల్‌ దగ్గరికి తీసుకుని వెళ్లడంతో, ప్రిన్సిపల్‌ కూడా ఉపాధ్యాయురాలికి మద్దుతు పలికారు. క్యారిస్‌ దుస్తులు లోదుస్తులను తలపించేలా ఉన్నాయని, ఇలాంటి దుస్తులను బహిష్కరించాలన్నారు. అంతేగాక క్యారిస్‌ను ఇంటికి పంపిచామని చెప్పారు. ప్రిన్సిపల్‌ చెప్పడంతో బాలికను పాఠశాల యాజమాన్యం తిరిగి ఇంటికి పంపించేసింది. ఇంటికి వెళ్లాక జరిగిన విషయాన్ని బాలిక తన తండ్రి క్రిస్టోపర్‌ విల్సన్‌కు వివరించింది.  

దీంతో అతడు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను తన కూతురిని అవమానించారని స్కూల్‌ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాడు. అంతేగాక ఆ మరుసటి రోజు క్యారిస్‌ తోటి విద్యార్థులంతా మద్దతు పలుకుతూ క్లాస్‌ రూం నుంచి వాకౌట్‌ చేశారు. ఇక క్యారిస్‌ తండ్రి విల్సన్‌ ‘ఇవాళ నా కూతురిని స్కూలు నుంచి ఇంటికి పంపించారు. తన డ్రెస్‌ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని ఆరోపించారు. దీనిని నేను వ్యతిరేకిస్తున్నాను. దయచేసిన నాకు, నా కూతురికి మద్దుతుగా నిలిచి ఇలాంటి ఘటనలు మరోసారి పునరావుతం కాకుండా చేస్తారని ఆశిస్తున్నాను’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అంతేగాక ఈ విషయం తనను బాధించిందని, 2021లో కూడా ఇలా జరగడంపై తాను నిరాశకు గురయ్యానని పేర్కొన్నాడు. ఈ దీనికి కారణమైన స్కూల్‌ ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నట్లు పాఠశాల సూపరెండెంట్‌ విల్సన్‌తో పేర్కొన్నట్లు తెలిపాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top