అమెరికాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు | Mass Shooting Incident Take Place In Kentucky | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. ఏడుగురికి గాయాలు

Sep 9 2024 5:06 AM | Updated on Sep 9 2024 5:06 AM

Mass Shooting Incident Take Place In Kentucky

ఆగంతకుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు

లండన్‌(యూఎస్‌ఏ): అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న కాల్పుల ఘటన నిందితుడి కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. ఇంటర్‌ స్టేట్‌–75పై లండన్‌ నగరానికి 9 మైళ్ల దూరంలోని లారెల్‌ కౌంటీలో రోడ్డు ప్రమాదం, అనంతరం జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. 

వీరిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. కాల్పులకు కారణమైన జోసెఫ్‌ ఎ కౌచ్‌(32) అనే శ్వేతజాతీయుడు అప్పటి నుంచి ఉన్నాడని పోలీసులు వివరించారు. తీవ్రంగా గాలిస్తోంది. అతడున్న ప్రాంతం తెలిసిందని అధికారులు తెలిపారు. వాహనదారులు ఇంటర్‌ స్టేట్‌–75, యూఎస్‌ 25పైకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు..అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement