రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!

A Man Who Got Trapped In A Cave For Two Days Was Safely Rescued After A Massive Operation - Sakshi

బ్రిటన్‌: మనం ఎక్కడైన అడవిలోనో లేక ఏదైనా నిర్మానుష్య ప్రదేశంలో చిక్కుకుపోయి, ఆఖరికి మొబైల్‌ ఫోన్‌లు పనిచేయనప​ప్పుడూ అది అత్యంత భయంకరంగా అనిపిస్తుంది. జనసంచారం లేని ఒక గుహలో  రెండు రోజులుగా  అది కూడా గాలి, వెలుతురు లేని ప్రదేశంలో అలా పడి ఉంటే ఎవ్వరికైన పై ప్రాణాలు పైకి పోతాయి. కానీ అతని కోసం 240 మంది సహాయ సిబ్బంది వచ్చి తక్షణ సహాయ చర్యలు చేపట్టి అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. అసలు ఎక్కడ ఏం జరిగిందే చూద్దాం రండి.

(చదవండి: టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్‌ తయారు చేసే స్థాయికి!)

అసలు విషయంలోకెళ్లితే....యూకేలో ఒక వ్యక్తి బ్రెకాన్ బీకాన్స్‌లోని గుహ వ్యవస్థల గురించి అధ్యయనం చేసే పరిశోధకుడు. అనుకోకుండా 50 అడుగుల లోతులో పడిపోతాడు. దీంతో అతని ఎముకలు చాలా వరకు విరిగిపోతాయి. దీంతో అతన్ని రక్షించడం కోసం దాదాపు 240 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇందులో యూకేకి చెందిన ఎనిమిది కేవ్ రెస్క్యూ బృందాలు కూడా ఉన్నాయి. సుమారు 54 గంటల తర్వాత అతను గుహ నుండి విజయవంతంగా బయటపడ్డాడు. ఇది వెల్ష్ కేవింగ్ చరిత్రలో సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్‌ నిలిచింది. ఆ తర్వాత సదురు వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

(చదవండి: వర్క్‌ ఫ్రం హోం: ఎక్స్‌ ట్రా వర్క్‌కి చెక్‌ పెట్టేలా కొత్త చట్టం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top