Triloki The Wind Powered Pneumatic Engine:We can drive from A Two Wheeler To A Train - Sakshi
Sakshi News home page

టీ అమ్మే వ్యక్తి.. నేడు రైలు ఇంజిన్‌ తయారు చేసే స్థాయికి!

Nov 9 2021 10:19 AM | Updated on Nov 9 2021 11:17 AM

Triloki The Wind Powered Pneumatic Engine Can Drive Anything From A Two Wheeler To A Train - Sakshi

ఆగ్రా:  టీ అమ్ముతూ, సైకిళ్లను రిపేర్ చేసే త్రిలోకి ప్రసాద్‌ గాలి శక్తితో నడిచే ఇంజన్‌ని తయారు చేశాడు. అతను ఆగ్రాలోని ఫతేపూర్‌ సిక్రి నివాసి. పైగా అతను తయారు చేసిన ఇంజిన్‌ను కారు, ఆటోమొబైల్స్‌కు సరిపోయేలా రీ డిజైన్‌ చేస్తే అధిక మొత్తంలో వాహన కాలుష్యం నియంత్రించగలం అని చెబుతున్నాడు. అంతేకాదు పైగా త్రిలోకి తయారు చేసిన న్యూమాటిక్ ఇంజిన్‌ ద్విచక్ర వాహనం నుండి రైలు వరకు ఏదైనా నడపగలదు.

(చదవండి: నీ దొంగ బుద్ధి తగలెయ్య!...మరీ ఆ వస్తువా! ఎక్స్‌పీరియన్స్‌ లేనట్టుందే....)

ఈ ఇంజిన్‌ వాహనం అవసరాలకు అనుగుణంగా ఇంజిన్‌ ఆకారాన్ని మాత్రమే మార్చితే సిపోతుందని అంటున్నాడు. ఈ మేరకు  50 ఏళ్ల త్రిలోక్‌  మాట్లాడుతూ....నేను చిన్న వయసులోనే ట్యూబ్‌వెల్ ఇంజిన్‌ను తయారు చేయడం నేర్చుకున్నాను. అయితే నేను 15 ఏళ్ల క్రితం టైర్లకు పంక్చర్లు రిపేరు చేసేవాడు. ఇలా నేను చేస్తూ ఉండగా ఒకరోజు పంక్చర్ అయిన ట్యూబ్‌లో గాలిని నింపుతున్నప్పుడు ఎయిర్ ట్యాంక్ వాల్వ్ లీక్ అయ్యి , గాలి ఒత్తిడి కారణంగా ట్యాంక్ ఇంజిన్ రివర్స్‌లో పనిచేయడం ప్రారంభించింది. దీంతో అప్పటి నుంచి గాలి శక్తిని ఇంజిన్‌లో ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను.

ఆ క్రమంలో  నేను యంత్రాన్ని గాలితో ఆపరేట్‌ చేయగలిగితే ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని భావించాను. ట్యాంక్‌లో గాలి నింపే ఖర్చును తగ్గించే ప్రయత్నంతో మొదలైన ఆలోచన చివరకు పూర్తి స్థాయి ఆటోమోటివ్ ఇంజిన్‌గా రూపాంతరం చెందింది. అని  చెప్పారు. ఈ క్రమంలో  త్రోలోకి భాగస్వామి సంతోష చౌహర్‌ మాట్లాడుతు తమ బృందంలో తానొక్కడే గ్రాడ్యుయేట్‌ అని మిగిలిన వారంతా పది కూడా పూర్తిచేయలేదు.

మా బృందం అంతా కలిసి ఊపిరితిత్తుల ఆకారంలో రెండు బెల్లోలను తయారు చేసి వాటిని యంత్రంలో అమర్చాం. ఆ తర్వాత యంత్రానికి ఉన్న  మీటను  తిప్పడం ద్వారా బెలోస్‌లో గాలి ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇంజిన్ మానవుని ఊపిరితిత్తుల మాదిరిగానే గాలిని పంపింగ్ చేయడం ప్రారంభించింది. అంతేకాదు యంత్రంలోని భాగాల్లో ఘర్షణను తగ్గించేందుకు లూబ్రికెంట్ అయిల్‌​ అవసరం.

పైగా పెట్రోల్-డీజిల్ ఇంజిన్‌ల వలే కాకుండా మేము తయారు చేసిన లిస్టర్‌ ఇంజన్‌లో లూబ్రికెంట్ ఆయిల్ వేడిగా లేదా నల్లగా మారదు. అని చెప్పాడు. అయితే త్రిలోకి తనకు వారసత్వంగా వచ్చిన ఇల్లు, పొలం అమ్మి ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు చెప్పాడు. అంతేకాదు తమ బృందం పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు.

(చదవండి: పువ్వుల్లొ దాగున్న ఇల్లు... కానీ అవి మొక్కలకు పూయని పూలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement