ఇరాన్‌ యుద్ధం.. నేడు మోదీ కీలక సమావేశం | US-Israel-Iran War News Live Updates On 22nd March | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్‌ యుద్ధం.. నేడు మోదీ కీలక సమావేశం

ఇరాన్ 400 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది: ఇజ్రాయెల్

  • ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై నేటికి 23 రోజులు
  • మాపై ఇరాన్ మొత్తం 400కి పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది
  • వాటిలో 92 శాతం క్షిపణులను అడ్డుకున్నాం: ఇజ్రాయెల్‌
2026-03-22 18:12:17

ఇరాన్ క్షిపణి కేంద్రాన్ని నాశనం చేశాం: అమెరికా

  • క్షిపణులు తయారవుతున్న ఇరాన్ సైనిక కేంద్రాన్ని నాశనం చేశాం
  • స్వల్ప, మధ్య, దీర్ఘ శ్రేణి క్షిపణులు తయారయ్యే కేంద్రం అది
  • ఈ నెల ప్రారంభంలో వాటిని నాశనం చేశాం: అమెరికా సెంట్రల్ కమాండ్  
2026-03-22 17:16:09

ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చేశాం: ఇరాన్‌

  • హార్మూజ్ దీవి సమీపంలో, మా దక్షిణ తీరంపై ఎఫ్-15 యుద్ధ విమానాన్ని అడ్డగించాం
  • ఎఫ్-15 యుద్ధ విమానాన్ని మా గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి: ఇరాన్‌
     
2026-03-22 15:47:10

ట్రంప్‌ ‘48 గంటల అల్టిమేటం’పై ఇరాన్‌ వార్నింగ్‌

  • హార్మూజ్ జలసంధిపై ట్రంప్ అల్టిమేటంపై ఇరాన్‌ స్పందన
  • ట్రంప్‌ అల్టిమేటాన్ని అమలు చేస్తే చూస్తూ ఊరుకోం
  • పశ్చిమాసియా ప్రాంతీయ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తాం
  • ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్‌ కమాండ్‌ ప్రకటన
2026-03-22 14:50:38

ప్రధాని మోదీ కీలక సమావేశం..

  • సాయంత్రం ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం.
  • కేంద్ర మంత్రులతో మోదీ భేటీ.
  • పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై చర్చ.
  • ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి. 
2026-03-22 13:57:16

గల్ఫ్‌కు మరొక మెరైన్ కార్ప్స్‌ యూనిట్

  • గల్ఫ్‌కు మరొక మెరైన్ కార్ప్స్‌ యూనిట్
  • పశ్చిమాసియాకు మెరైన్ కార్ప్స్‌కు చెందిన దాదాపు 2,200 మంది సైనికులు
  • 3 నౌకలు అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి పశ్చిమాసియాకు బయలుదేరాయి.
  • ఇప్పటికే ఒక మెరైన్ కార్ప్ యూనిట్ గల్ఫ్ ప్రాంత సముద్ర జలాల్లో ఉంది.
  • ఇప్పుడు ఇంకో దాన్ని అక్కడికి పంపుతున్నారు.
  • ఈ పరిణామాల ప్రాతిపదికన ఇరాన్‌పై భూతల దాడులకూ అమెరికా సన్నాహాలు
  • ఈ మేరకు అమెరికన్ మీడియా సంస్థ కథనంలో విశ్లేషించారు.
  • ట్రంప్ నుంచి ఆదేశాలు అందగానే, ఇరాన్‌పై భూతల దాడులు చేసేలా అమెరికా ఆర్మీ సన్నద్ధం.
2026-03-22 13:40:47

పారచూట్ల ద్వారా ఇరాన్‌లోకి అమెరికా సైనికులు

  • పారచూట్ల ద్వారా ఇరాన్‌లోకి అమెరికా సైనికులు
  • పశ్చిమాసియా వైపునకు అమెరికా సైన్యంలోని కీలకమైన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన వేలాది మంది సైనికులు
  • ఈ డివిజన్ సభ్యులు విమానాల నుంచి పారచూట్ల ద్వారా భూమిపైకి దిగడంలో దిట్టలు.
  • బహుశా వీరినే భూతల దాడులకు అమెరికా ఆర్మీ వినియోగిస్తుందనే అంచనా.
  • సముద్ర మార్గం ద్వారా భూతల దండయాత్రలు చేయడంలో నిష్ణాతులైన మెరైన్ ఎక్స్‌పీడిషనరీ యూనిట్ (ఎంఈయూ) సభ్యులు కూడా 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌‌లో ఉంటారు.
  • అత్యవసర యుద్ధ సేవలను అందించేందుకు ట్రైనింగ్ పొందిన అమెరికా ఆర్మీ గ్లోబల్ రెస్పాన్స్ ఫోర్స్ (జీఆర్‌ఎఫ్) దళాలు సైతం 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌‌లో భాగంగా ఉన్నాయి.
2026-03-22 13:38:47

ఇరాన్‌పై అమెరికా భారీ ప్లాన్‌..

  • ఇరాన్‌పై అమెరికా భారీ ప్లాన్‌..
  • ఇరాన్‌లోని రవాణా మార్గాల ఆక్రమణకు అమెరికా ప్లాన్
  • ఇరాన్‌లోని ప్రధాన రవాణా మార్గాలను ఎలా అదుపులోకి తీసుకోవాలి?.
  • ఆ దేశ సైనికులు, పారామిలిటరీ బలగాలను ఎలా నిర్బంధించాలి?
  • వారిని ఏయేచోట్ల దిగ్బంధించాలి?
  • వంటి అంశాలపైనా అమెరికా ఆర్మీ ప్రత్యేక సమావేశాల్లో చర్చించారని పెంటగాన్‌ పేర్కొంది.

 

2026-03-22 13:38:47

గ్రీన్‌లాండ్‌ను రక్షించేందుకు సిద్ధం: ఇరాన్‌

  • గ్రీన్‌లాండ్‌ను రక్షించేందుకు సిద్ధం: ఇరాన్‌
  • గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకునేందుకు ట్రంప్‌ ఇటీవల తీవ్ర ప్రయత్నాలు
  • గ్రీన్‌లాండ్‌పై తాజాగా ఇరాన్‌ సంచలన ప్రకటన.
  • ఈ విషయంపై ఇరాన్‌ అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
  • ట్రంప్‌ నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
  • ఈ క్రమంలో యూరోపియన్‌ యూనియన్‌కు ఇరాన్‌ ఆఫర్‌ ఇచ్చింది. 
  • అలాగే, బ్రిటన్‌-అమెరికా సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై క్షిపణులతో దాడిపై స్పందించిన ఇరాన్‌.
  • ఆ దాడి వెనక ఇరాన్ పాత్ర లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

 

 

2026-03-22 12:50:18

యుద్ధం వేళ భారత్‌కు గుడ్‌న్యూస్‌..

  • భారత్‌కు చేరుకున్న ఎల్పీజీ నౌక
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ మరో ఎల్​పీజీ నౌక భారత్‌కు చేరుకుంది.
  • అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, నెదర్లాండ్​ పోర్ట్ నుంచి పైక్సిస్ పయనీర్ అనే భారీ ఎల్​పీజీ నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరుకుంది.
  • ఈ నౌక సుమారు 16,714 టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్‌ను మోసుకొచ్చింది.
  • 'ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్' కోసం దీన్ని దిగుమతి చేసుకున్నారు.
  • ఫిబ్రవరి 14న అమెరికా నుంచి బయలుదేరిన ఈ నౌక, సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ తెల్లవారుజామున మంగళూరు తీరానికి చేరుకుంది.
  • రాబోయే వారంలో మరిన్ని నౌకల ద్వారా న్యూ మంగళూరు పోర్ట్ మొత్తం 72, 700 టన్నుల ఎల్​పీజీని అందుకోనుంది.
  • ఇక్కడి నుంచి పైప్‌లైన్ల ద్వారా బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాలకు వంటగ్యాస్ సరఫరా చేయనున్నారు.

 

2026-03-22 09:34:23

హిందూ మహాసముద్రంలో అలజడి.

  • హిందూ మహాసముద్రంలో అలజడి.
  • డీగో గార్సియా స్థావరంపై ఇరాన్‌ క్షిపణి దాడి.
  • 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురిపెట్టిన టెహ్రాన్‌.
  • ఇరాన్‌ రేంజ్‌లోకి యూరప్‌ దేశాలు.
  • వణికిపోతున్న పాశ్చాత్య దేశాలు.
2026-03-22 07:44:41

అణు పరిశోధన కేంద్రం సమీపంలో ఇరాన్‌ దాడులు..

  • ఇజ్రాయెల్‌ అణు పరిశోధన కేంద్రం సమీపంలో ఇరాన్‌ దాడులు.
  • ఇజ్రాయెల్‌లోని డిమోనా, అరద్‌ ప్రాంతాలపై ఇరాన్‌ క్షిపణుల దాడి.
  • ఇరాన్‌ దాడిలో 100 మందికి పైగా గాయాలు.
  • అణు పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదు: ఐఏఈఐ
2026-03-22 07:44:41

హార్మూజ్‌పై 20 దేశాల విజ్ఞప్తులు..

  • పశ్చిమాసియాలో 23వ రోజుకు చేరిన యుద్ధం.
  • ఇరాన్‌పై దాడులను ఉధృతం చేసిన ఇజ్రాయెల్‌.
  • కొనసాగుతున్న ఇరాన్‌ ప్రతీకార దాడులు.
  • హార్మూజ్‌ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 20 దేశాల విజ్ఞప్తులు.
  • ఆయిల్‌ రిఫైనరీలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించిన దేశాలు.
2026-03-22 07:44:41

ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక

  • ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక
  • హార్మూజ్‌ జలసంధిని 48 గంటల్లో తెరవాలని ట్రంప్‌ హుకుం..
  • లేని పక్షంలో ఇరాన్‌పై దాడులు ఉద్ధృతం చేస్తామని ట్రంప్‌ హెచ్చరిక
  • ఇరాన్‌ విద్యుత్‌ ప్లాంట్‌లను పూర్తిగా ధ్వంసం చేస్తామని వార్నింగ్‌.
  • అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు.
  • ఎలాంటి బెదిరింపులు లేకుండా జలసంధిని తెరవాలని ఇరాన్‌కు సూచన.
  • ఇప్పటికే ఇరాన్ చమురు విక్రయంపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తేస్తున్నట్లు అమెరికా ప్రకటన
  • అమెరికా ప్రకటనలో వాస్తవం లేదన్న ఇరాన్‌. 
2026-03-22 07:44:41
Advertisement
 
Advertisement
Advertisement