విరిగిపడ్డ కొండచరియలు, 25 మంది గల్లంతు | At Least 3 Dead 25 More Missing In Nepal Landslides | Sakshi
Sakshi News home page

విరిగిపడ్డ కొండచరియలు, 25 మంది గల్లంతు

Sep 13 2020 10:37 AM | Updated on Sep 13 2020 10:56 AM

At Least 3 Dead 25 More Missing In Nepal Landslides - Sakshi

కఠ్మాండు: నేపాల్‌లోని సింధూపాల్‌చౌక్‌ జిల్లాలో గతరాత్రి కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి పైగా గల్లంతయ్యారు. బర్హాబిసి గ్రామీణ మున్సిపాలిటీ-7లోని భిర్ఖార్కా ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, 9 ఇళ్లు మట్టి కింద కూరుకుపోయాయని మున్సిపాలిటీ చైర్మన్‌ నిబ్‌ ఫిన్‌జో షెర్ఫా తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నేపాల్‌ ఆర్మీ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement