17 సార్లు పొడిచి భార్యపై కిరాతకం.. అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు

Kerala Man Gets Life Sentence In US Stabbed Wife 17 Times - Sakshi

న్యూయార్క్: హత్య కేసులో అమెరికాలో కేరళవాసికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మారణాయుధంతో దాడి చేసిన కేసులో గరిష్టంగా ఐదు సంవత్సరాల శిక్షను ఖరారు చేసింది. దోషి తన భార్యను 17 సార్లు అతి దారుణంగా పొడిచాడు. అనంతరం ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి.. దోషికి కఠిన యావజ్జీవ శిక్షను విధించారు. 

ఫిలిప్ మ్యాథ్యు, మేరిన్ జోయ్‌(26) కేరళకు చెందినవారు. వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది  జోయ్‌. అయితే.. మనస్పర్థల కారణంగా మ్యాథ్యు విడాకులు తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే విధులు ముగించుకుని ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న జోయ్‌ని మ్యాథ్యు అడ్డగించి కత్తితో 17 సార్లు పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె పైనుంచి కారును పోనిచ్చాడు. జోయ్‌ సన్నిహితులు ఆమెను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. 

ఆ సమయంలో తనకో పాప ఉంది అని తెలిపిన జోయ్.. నిందితుని వివరాలను తెలిపింది. దీని ఆధారంగా నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.. కేసును నమోదు చేశారు. దాదాపు మూడేళ్ల విచారణ తర్వాత న్యాయస్థానం దోషికి యావజ్జీవ శిక్ష విధించింది. తీర్పుపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు దోషికి శిక్ష పడినందుకు ఆనందం వ్యక్తం చేసింది.  

ఇదీ చదవండి: మాజీ డ్రైవరే హంతకుడు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top