కెన్యాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి | Indians Dead In Kenya Road Accident | Sakshi
Sakshi News home page

కెన్యాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి

Jun 11 2025 7:32 AM | Updated on Jun 11 2025 7:33 AM

Indians Dead In Kenya Road Accident

దోహా: ఖతార్‌లో నివసిస్తున్న ఐదుగురు భారతీయులు కెన్యాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను దోహాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం వెల్లడించింది.

విహారయాత్రలో భాగంగా 28 మంది ప్రవాసభారతీయుల బృందం ఖతార్‌ నుంచి కెన్యాకు వెళ్లింది. కెన్యాలోని నయాందారూ కౌంటీలో ఒల్‌ జొరోరోక్‌–నకూరూ రోడ్డులో వీళ్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. విషయం తెల్సుకున్న నైరోబీలోని భారత హైకమిషన్‌ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు.

మృతదేహాల తరలింపు, క్షతగాత్రులకు సహాయక కార్యక్రమాల్లో అధికారులు నిమగ్నమయ్యారని దోహాలోని ఇండియన్‌ ఎంబసీ తెలిపింది. రోడ్డుపై అదుపు తప్పిన పర్యాటకుల బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని ది గల్ప్‌ టైమ్స్‌ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. చనిపోయిన ఆరుగురి వివరాలు ఇలా ఉన్నాయి. మృతుల్లో ఐదుగురు కేరళకు చెందిన వారుగా గుర్తించారు.

మావెలిక్కరకు చెందిన గీతా షోజి ఐజాక్ (58), జస్నా కుట్టిక్కట్టుచలిల్ (29), రూహి మెహ్రీ ముహమ్మద్ (18 నెలలు), ఒట్టప్పలంకు చెందిన రియా ఆన్ (41), టైరా రోడ్రిగ్స్ (8)లు గుర్తించారు. రియా భర్త జోయెల్ మరియు ఆమె పెద్ద కుమారుడు రవిస్ (14) గాయాలతో న్యాండరువాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ప్రమాదంలో గాయపడిన ప్రవాసభారతీయులను దగ్గర్లోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.  


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement