breaking news
Indians death toll
-
కెన్యాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి
దోహా: ఖతార్‌లో నివసిస్తున్న ఐదుగురు భారతీయులు కెన్యాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను దోహాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం వెల్లడించింది.విహారయాత్రలో భాగంగా 28 మంది ప్రవాసభారతీయుల బృందం ఖతార్ నుంచి కెన్యాకు వెళ్లింది. కెన్యాలోని నయాందారూ కౌంటీలో ఒల్ జొరోరోక్–నకూరూ రోడ్డులో వీళ్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. విషయం తెల్సుకున్న నైరోబీలోని భారత హైకమిషన్ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు.మృతదేహాల తరలింపు, క్షతగాత్రులకు సహాయక కార్యక్రమాల్లో అధికారులు నిమగ్నమయ్యారని దోహాలోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. రోడ్డుపై అదుపు తప్పిన పర్యాటకుల బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని ది గల్ప్ టైమ్స్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. చనిపోయిన ఆరుగురి వివరాలు ఇలా ఉన్నాయి. మృతుల్లో ఐదుగురు కేరళకు చెందిన వారుగా గుర్తించారు.మావెలిక్కరకు చెందిన గీతా షోజి ఐజాక్ (58), జస్నా కుట్టిక్కట్టుచలిల్ (29), రూహి మెహ్రీ ముహమ్మద్ (18 నెలలు), ఒట్టప్పలంకు చెందిన రియా ఆన్ (41), టైరా రోడ్రిగ్స్ (8)లు గుర్తించారు. రియా భర్త జోయెల్ మరియు ఆమె పెద్ద కుమారుడు రవిస్ (14) గాయాలతో న్యాండరువాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ప్రమాదంలో గాయపడిన ప్రవాసభారతీయులను దగ్గర్లోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ⚠️ A tragic road accident occurred in central Kenya, where a bus carrying tourists rolled over, resulting in six fatalities and 27 injuries.Location — The accident took place at Gichaka, along the Ol Jororok-Nakuru road in Nyandarua County.Cause — The exact cause of the bus… pic.twitter.com/QsNRk7o5cq— Sir Adam ™ (@AdamMaina_) June 10, 2025 -
జార్జియాలోని రిసార్టులో 11 మంది భారతీయుల మృతి
టిబిలిసి: జార్జియాలో పర్వతశ్రేణుల్లో ఒక రిసార్టులో 11 మంది భారతీయులు మృతి చెందారని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. మృతుల శరీరాలపై గాయాలేమీ లేవని, హింస జరిగిన అనవాళ్లు కూడా కన్పించలేదని జార్జియా విదేశాంగ శాఖ తెలిపింది. విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ కారణంగా 12 మంది మరణించగా.. ఇందులో 11 మంది భారతీయులని తెలిపింది. పర్వత ప్రాంతమైన గదౌరీలో ఈ 11 మంది హవేలీ అనే భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్నారని వివరించింది. మృతుల కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అవసరమైన సహాయసహకారాలను అందిస్తున్నామని పేర్కొంది. మృతికి కారణాలను తెలుసుకునేందుకు జార్జియా ప్రభుత్వం ఒక ఫోరెన్సిక్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. -
Kuwait Building Fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం... 49 మంది దుర్మరణం
దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కారి్మకులు నివసిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వలస వచి్చన వీరంతా ఎన్బీటీసీ గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కారి్మకుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కారి్మకులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది. కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్‌లోని మొత్తం కారి్మకుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాంగాఫ్ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కలి్పంచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. యాజమాన్యం దురాశకు అమాయకులు బలి మాంగాఫ్ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్–యూసుఫ్ అల్–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కలి్పంచని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కారి్మకులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిహుటాహుటిన కువైట్‌కు మంత్రి రాజవర్ధన్ సింగ్కువైట్ అగ్నిప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయినవారికి సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్లు చెప్పారు. కువైట్ భారత రాయబార కార్యాలయం సహాయక చర్యల్లో నిమగ్నమైందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. ఈ ఉదంతంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్ సింగ్ కువైట్‌కు బయలుదేరారు. సహాయ చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు. మృతుల్లో మలయాళీలు ఎక్కువగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తమయ్యారు. కేంద్రం వెంటనే తగిన సాయం అందించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు. -
అమెరికాలో మరో భారతీయుడి హత్య
వాషింగ్టన్: అమెరికాలో భారతీయుల వరస మరణాలు అక్కడి భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. కాలిఫోరి్నయా రాష్ట్రంలో కేరళ కుటుంబం మొత్తం సొంతింట్లో మరణించిన వార్త మరువకముందే మరో హత్యోదంతం అమెరికాలో వెలుగుచూసింది. అలబామా రాష్ట్రంలో రహదారి వెంట హోటల్‌ను నడుపుకుంటున్న 76 ఏళ్ల ప్రవీణ్ రావూజీభాయ్ పటేల్‌ను అద్దె గది కోసం వచి్చన ఒక కస్టమర్ కాల్చి చంపారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జరిగిన ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలను షెఫీల్డ్ పట్టణ పోలీస్ ఉన్నతాధికారి రిక్కీ టెర్రీ గురువారం వెల్లడించారు. షెఫీల్డ్ పట్టణంలో హిల్‌క్రెస్ట్ మోటెల్ పేరుతో ఒక హోటల్‌ను ప్రవీణ్ సొంతంగా నిర్వహిస్తున్నారు. ఆ హోటల్‌కు 35 ఏళ్ల విలియం జెరిమీ మోరే అనే వ్యక్తి వచ్చి రూమ్ కావాలని ప్రవీణ్‌ను అడిగాడు. కొద్దిసేపటికే విలియం, ప్రవీణ్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. వెంటనే విలియం తన వద్ద ఉన్న గన్‌తో ప్రవీణ్‌ను కాలి్చచంపాడు. అక్కడి నుంచి పారిపోయి దగ్గర్లోని ఇంట్లో చొరబడేందుకు ప్రయతి్నస్తుండగా పోలీసులు అరెస్ట్‌చేశారు. మూడు సార్లు తుపాకీ శబ్దం విన్నానని అక్కడే ఉన్న ఒక సాక్షి చెప్పారు. అసలు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. -
‘హజ్’ తొక్కిసలాట మృతులు 769
22కి పెరిగిన భారతీయుల సంఖ్య మక్కా/మినా: హజ్ యాత్ర సందర్భంగా గురువారం మినాలో జరిగిన తొక్కిసలాట సంఘటనలో మృతిచెందిన భారతీయుల సంఖ్య శనివారానికి 22కి చేరింది. దీంతో ఈ సంఘటనలో మొత్తం మృతుల సంఖ్య 769కి చేరుకుంది. మృతిచెందిన భారతీయులను గుర్తించడానికి సౌదీలోని భారత ఎంబసీ అక్కడి అధికారులతో కలసి పనిచేస్తున్నట్టు భారత విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. 18 మంది మృతుల్లో 11 మంది గుజరాత్‌కు చెందినవారేనని చెప్పారు. తొక్కిసలాటలో మొత్తం 13 మంది భారతీయులకు గాయాలయ్యాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా హజ్‌యాత్రకు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాలని సౌదీ రాజు అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని నియమించాలనీ ఆదేశించారు. యాత్రికులు అక్కడ ఉన్న అధికారుల సూచనలు పాటించకుండా ముందుకు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగి ఉండవచ్చని సౌదీ ఆరోగ్య మంత్రి ఫలీ పేర్కొన్నారు.