Google Meet : పూర్‌ కనెక్షన్‌కి సొల్యూషన్‌

Google Meet Will Solved Poor Network Problem By Adding New Feature - Sakshi

పూర్‌ కనెక్షన్‌కి చెక్‌ పెట్టిన గూగుల్‌

గూగుల్‌ మీట్‌లో కొత్త ఫీచర్‌

వెబ్‌డెస్క్‌: కరోనా సంక్షోభం మొదలయ్యాక జనాలు ప్రత్యక్షంగా కలవడం ఆల్‌మోస్ట్‌ నేరంగానే మారింది. ఎవరికి వారు సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాల్సిన పరిస్థితే ప్రస్తుతం నెలకొని ఉంది. కానీ ఆఫీసుల్లో పని చేసే వాళ్లకు, కార్పొరేట్‌ కంపెనీల ఉద్యోగులకు తరచుగా సమావేశం అవక తప్పదు. ఏడాదిన్నరగా నూటికి తొంభైశాతం సమావేశాలు వర్చువల్‌గా జరుగుతున్నాయి. అకాడమిక్‌ వింగ్‌లోనూ వర్చువల్‌ క్లాసులే రాజ్యమేలుతున్నాయి. 

పూర్‌ కనెక్షన్‌ 
వర్చువల్‌ మీటింగ్‌లో పాల్గొనేందుకు జూమ్‌, గూగుల్‌ మీట్‌ వంటి అప్లికేషన్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వర్చువల్‌ మీటింగ్‌లో ఉన్నప్పుడు అందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి నెట్‌వర్క్‌ కనెక్షన్‌. మీటింగ్‌ మధ్యలో ఉండగా చాలా సార్లు పూర్‌ కనెక్షన్‌ నోటిఫికేషన్‌ రావడమనేది వర్చువల్‌ మీటింగుల్లో పాల్గొనే వాళ్లలో చాలా మందికి అనుభవమే. పూర్‌ కనెక్షన్‌ నోటిఫికేషన్‌ రావడం ఆలస్యం వర్చువల్‌​ మీటింగ్‌కి మనం ఉపయోగించే ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌, ట్యాబ్‌ తదితర డివైజ్‌ని పట్టుకుని అటు ఇటు పరిగెత్తుతూ అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పుడీ సమస్యకు చెక్‌ పెట్టామని చెబుతోంది టెక్‌ దిగ్గజం గూగుల్‌. 

ట్రబుల్‌ షూట్‌
గూగుల్‌ మీట్‌ యాప్‌ ద్వారా ఒకేసారి 250 మంది వర్చువల్‌గా సమావేశం అయ్యే అవకాశం ఉంది. దీంతో చాలా మంది వర్చువల్‌ సమావేశాలకు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో కొత్త ఫీచర్‌ యాడ్‌ చేయడం ద్వారా పూర్‌ కనెక్షన్‌ సమస్యకు సొల్యూషన్‌ అందిస్తోంది గూగుల్‌. వర్చువల్‌ మీటింగ్‌ మధ్యలో పూర్‌ కనెక్షన్‌ నోటిఫికేషన్‌తో పాటు ఆటోమేటిక్‌గా మోర్‌ ఆప్షన్‌ మెనూ బబుల్‌ కూడా వస్తుంది. దానిపై క్లిక్‌ చేయగానే ట్రబుల్‌షూట్‌, హెల్ప్‌ ఆప్షన్‌ వస్తుంది. దీన్ని ఎంచుకోగానే పూర్‌ కనెక్షన్‌ సమస్యను పరిష్కరించే రికమండేషన్స్‌ అక్కడ కనిపిస్తాయి. వాటిని ఫాలో అవడం ద్వారా పూర్‌ కనెక్షన్‌ సమస్యను ఎదుర్కొవచ్చని గూగుల్‌​ చెబుతోంది.

జూన్‌ 1 నుంచి ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. డివైస్‌ మోడల్‌, ర్యామ్‌ కెపాసిటీ, యూసేజీ, నెట్‌వర్క్‌ కనెక్షన్‌లను ఆధారంగా చేసుకుని టైలర్‌మేడ్‌గా ఈ ట్రబుల్‌ షూట్‌ సజేషన్స్‌ ఉంటాయని గూగుల్‌ అంటోంది. ఈ సజెన్స్‌ పాటించడం ద్వారా డివైజ్‌ ర్యామ్‌, బ్యాటరీలపై ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతోంది 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top