అమ్మాయిలకు 'ఆ పేరు' పెట్టడం బాగా తగ్గించేశారు..

Girls By Naming Alexa Has Come Down In America - Sakshi

అలెక్సా..అమెజాన్‌ తెచ్చిన ఒక పాపులర్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌ లేదా డిజిటల్‌ పనిమనిషి. సాధారణంగా కంపెనీలు తమ కొత్తకొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చినప్పుడు వాటికి రకరకాల కొత్త పేర్లు పెడుతుంటాయి. తదనంతర కాలంలో ఉత్పత్తి ప్రాచుర్యాన్ని బట్టి ఆయా కొత్తపేర్లూ పాపులర్‌ అవుతాయి. అయితే.. 2014లో అమెజాన్‌ మార్కెట్లోకి  తన వర్చువల్‌ అసిస్టెంట్‌ను తెచ్చినప్పుడు దానికి అప్పటికే అమెరికాలో ప్రాచుర్యంలో ఉన్న ఒక పేరును పెట్టింది.. అలెక్సా అని.. పాపులర్‌ పేరు అని ఎందుకు అన్నామంటే.. అమెరికాలోని ఆడపిల్లలకు ఎక్కువగా పెట్టే పేర్లలో అలెక్సా కూడా ఒకటి.  

ప్రొడక్ట్‌ పాపులర్‌ అయింది.. పేరు అన్‌పాపులర్‌ అయింది.. ఎందుకంటే.. యూఎస్‌ సోషల్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకారం 2015లో అమెరికాలో పుట్టిన పిల్లల్లో 6,052 మందికి అలెక్సా అనే పేరు పెడితే.. 2019 సరికి అ పేరు పెట్టేవారి సంఖ్య 1995కి తగ్గిపోయిందట. 2015లో ఆడపిల్లలకు పెట్టే పాపులర్‌ పేర్లలో అలెక్సా 32వ స్థానంలో ఉండగా.. నాలుగేళ్లలో అది 139వ స్థానానికి పడిపోయింది. ఎందుకంటే.. పిల్లలకు అలెక్సా అనే పేరు పెడితే.. జీవితాంతం ఆ పేరు ఒక డిజిటల్‌ పనిమనిషి పేరుతో ముడిపడి ఉన్నట్లే కదా.. వెళ్లేకొలది ఆ పేరును పెట్టడం మానేసే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top