Russia Ukraine War Effect: Fuel Prices Massively Raised In Sri Lanka, Details Inside - Sakshi
Sakshi News home page

Russia Ukraine Crisis: లీటర్‌ పెట్రోల్ రూ. 204, డీజిల్‌ ఎంతంటే..?

Feb 26 2022 7:02 PM | Updated on Feb 26 2022 7:51 PM

Fuel Prices Massively Raised In Sri Lanka - Sakshi

కోలంబో: ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభం క్రమంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస‍్థలపై ప్రభావం చూపుతోంది. యుద్దం ప్రారంభమైన రోజునే దీని ప్రభావం ముడి చమురు ఎగుమతులపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క‍్రమంలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంకకు రష్యా వార్‌ కూడా తీవ్ర సమస‍్యగా మారింది.  

రష్యా- ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై పడింది. దీంతో శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలోని చమురు సంస్థలు పెట్రోల్‌పై రూ. 20, డీజిల్‌ రూ. 15 లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 204కు చేరగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 139కి పెరిగింది. ఈ క్రమంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సామాన్యులపై మరింత భారం పడినట్టు అయ్యింది. 

ఇదిలా ఉండగా.. శ్రీలంక ప్రభుత్వ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశంలో ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. విదేశీ మారక నిల్వలను ఆదాచేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. దీంతో నిత్యవసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బ్లాక్ మార్కెట్‌లో బియ్యం, చక్కెర, ఉల్లిపాయలు సహా నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీటికి తోడు గతేడాది అక్టోబర్‌లో వంట గ్యాస్ ధర సిలిండర్ రూ. 2,657 కు చేరి రికార్డు సృష్టించింది. తాజాగా కరెంట్‌ కోతలు సైతం విధించడంతో ప‍్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement