ఏ దేశానికైనా గంటలో ఆయుధాల సరఫరా

Elon Space Laboratory Introducing New Project Space X  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎలాన్‌ మస్క్‌కు చెందిన అంతరిక్ష ప్రయోగశాల ‘స్పేస్‌ ఎక్స్‌’ మరో అద్భుత ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతోంది. అంగారకుడికిపైకి మానవులను తీసుకెళ్లే మిషన్‌ను చేపట్టి ఇప్పటికే ఎంతో పురోగతిని సాధించిన స్పేస్‌ ఎక్స్‌ ప్రపంచంలో ఏ దేశానికైనాసరే గంట లోపల ఆయుధాలు తీసుకెళ్లి దించి వచ్చే రాకెట్‌ను తయారు చేసేందుకు అమెరికా సైన్యంతో ఒప్పందం చేసుకుంది. ఓ చోటుకు ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి తీసుకొచ్చి మళ్లీ ఉపయోగించడంలో ఇప్పటికే విజయం సాధించిన స్పేస్‌ ఎక్స్‌ కార్గో రాకెట్‌ అంటే సరకును రవాణా చేసే రాకెట్‌ను తయారు చేయబోవడం మాత్రం ఇదే మొదటిసారి. చదవండి: విజయవంతంగా రుద్రం-1 క్షిపణి ప్రయోగం

అందుకే ఈ ప్రయత్నంలో తనకు అనుబంధంగా కొనసాగుతున్న వైమానిక సంస్థ ఎక్స్‌ ఆర్క్‌ సహకారాన్ని కూడా తీసుకుంటోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు 7,500 మైళ్ల దూరంలోని అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా వైమానిక స్థావరానికి ఆయుధాలను గంటలో చేరవేయడం ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. ప్రస్తుతం కార్గో విమానం ద్వారా అక్కడికి ఆయుధాలను చేరవేయడానికి 15 గంటల సమయం పడుతోంది. అతి వేగంగా ఆయుధాలను తరలించే అత్యాధునిక కార్గో విమానాలు అమెరికా వద్ద ప్రస్తుతం 233 ఉన్నాయి. అయితే వాటి గరిష్ట వేగం గంటకు 590 మైళ్లే. 80 టన్నుల సరకు రవాణా చేసేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. వచ్చే ఏడాది ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభమవుతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. చదవండి: కోవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చినా తీసుకోను

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top