అమెరికాకు ‘స్పేస్‌ ఎక్స్‌’ నిఘా ఉపగ్రహాలు! | Elon Musk SpaceX Is Building Spy Satellite Network For US Intelligence Agency | Sakshi
Sakshi News home page

అమెరికాకు ‘స్పేస్‌ ఎక్స్‌’ నిఘా ఉపగ్రహాలు!

Mar 18 2024 6:04 AM | Updated on Mar 18 2024 12:37 PM

Elon Musk SpaceX Is Building Spy Satellite Network For US Intelligence Agency - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ స్థాపించిన ‘స్పేస్‌ ఎక్స్‌’ కంపెనీ కేవలం అంతరిక్ష ప్రయోగాలే కాదు, నిఘా ఉపగ్రహాల తయారీకి సైతం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్పేస్‌ ఎక్స్‌తో అమెరికా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ‘ఎన్‌ఆర్‌ఓ’ డీల్‌ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 2021లోనే ఒప్పందం కుదిరిందని, ఈ కాంట్రాక్టు విలువ 1.8 బిలియన్‌ డాలర్లు అని తెలియజేశాయి.

దీనిప్రకారం ఎలాన్‌ మస్క్‌ సంస్థ వందలాది నిఘా ఉపగ్రహాలను తయారు చేసి, ఎన్‌ఆర్‌ఓకు అప్పగించాల్సి ఉంటుంది. అమెరికా భద్రతా సంస్థలు, ఎలాన్‌ మస్క్‌ కంపెనీ మధ్య బలపడుతున్న బంధానికి ఈ ఒప్పందమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ ఉపగ్రహాలు. భూగోళంపై ప్రతి ప్రాంతంపై డేగ కన్నేస్తాయి. అమెరికా సైనిక ఆపరేషన్లకు తోడ్పాటునందిస్తాయి. లక్ష్యాలను కచ్చితంగా గుర్తించడానికి సహకరిస్తాయి. వీటితో అమెరికా ప్రభుత్వానికి, సైన్యానికి చాలా ప్రయోజనాలే ఉంటాయిని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement