ప్రిన్స్‌ ఫిలిప్‌ కన్నుమూత | Duke of Edinburgh Prince Philip dead at the age of 99 | Sakshi
Sakshi News home page

ప్రిన్స్‌ ఫిలిప్‌ కన్నుమూత

Apr 9 2021 4:53 PM | Updated on Apr 9 2021 6:38 PM

Duke of Edinburgh Prince Philip dead at the age of 99 - Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99) కన్నుమూశారు. ఈ మేరకు బకింగ్‌ హ్యామ్‌ ప్యాలెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. విండ్సర్ కాజిల్ లో శుక్రవారం ఫిలిప్‌ తుదిశ్వాస విడిచారని తెలిపింది. ఈ విషయాన్ని గురించి రాయల్ ఫ్యామిలీలోని ఇతర సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించింది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా  జాతీయ  జెండాలను అవనతం చేయాలని ప్రకటించింది.

కాగా ప్రిన్స్ ఫిలిప్ 1921, జూన్  10న  కార్ఫు ద్వీపంలో జన్మించారు. 1947 లో యువరాణి ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు. ప్రిన్స్ ఫిలిప్,రాణి దంపతులకు నలుగురు పిల్లలు, ఎనిమిది మంది మనవరాళ్ళు  10 మంది మునిమనవళ్లు ఉన్నారు.

1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement