
యూరప్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మొహం మీద ఆయన సతీమణి బ్రిగిట్టే మేక్రాన్ కొట్టారంటూ ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను బ్రిగిట్టే నిజంగా కొట్టారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
దాదాపూ పదేళ్ల తర్వాత అధ్యక్షుడు మేక్రాన్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయాసియా దేశాల్లో సుదీర్ఘ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆగ్నేయాసియా దేశాలతో అమెరికా, చైనాకు ఫ్రాన్స్ ప్రత్యామ్నాయమనే సంకేతాలిచ్చేలా డిఫెన్స్, ఎనర్జీ, టెక్నోలజికల్ ఇన్నోవేషన్‌తో పాటు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మే 25న వియత్నాం రాజధాని హనోయిలో అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో హనోయి నోయి బాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆ సమయంలో జరిగిన ఓ ఊహించని ఘటన మీడియా కంట పడింది. ప్రస్తుతం ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చకు దారి తీసింది.
Bizarre moment Emmanuel Macron is slapped by his wife Brigitte pic.twitter.com/kYsE5MCDV1
— The Sun (@TheSun) May 26, 2025
అసలేమైందంటే?
మేక్రాన్, బ్రిగిట్టేలు ప్రత్యేక విమానం లోపలి నుంచి బయటకు వచ్చే సమయంలో విమానం డోర్లు తెరుచుకున్నాయి. అయితే, ఆ డోర్ ఓపెన్ అయ్యే సమయంలో బ్రిగిట్టే తన రెండు చేతులతో మేక్రాన్ మొహం మీద కొట్టిన దృశ్యాలు కనిపించాయి. బ్రిగిట్టే చేతులు తన మొహం మీద తగలడంతో వెంటనే తన తలను వెనక్కి జరిపారు. దీంతో మేక్రాన్‌ను బ్రిగిట్టే కొట్టారంటూ అంతర్జాతీయ మీడియా వీడియోల్ని ప్రసారం చేశాయి.
అందుకు ఊతం ఇచ్చేలా ఈ ఘటన తర్వాత తన చేతిని పట్టుకోమని బ్రిగిట్టేకు తన చేతిని అందించబోయాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. తిరస్కరించింది. కోపంగా అక్కడి నుంచి కదిలింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
ఈ ఘటనపై మేక్రాన్‌ను మీడియా మాట్లాడారు. వైరల్ అవుతున్న వీడియోల్లో నిజం లేదన్నారు. భార్య బ్రిగిట్టే తనను కొట్టలేదని, తాము ఎప్పుడూ ఇలాగే సరదాగా గొడవ పడుతూ ఉంటామని అన్నారు. కానీ, ఆ వీడియోలో కనిపిస్తున్న సీరియస్‌నెస్‌ను చూస్తే మాత్రం మేక్రాన్ అబద్దం చెబుతున్నాడనే విషయం స్పష్టమవుతోందటూ అంతర్జాతీయ మీడియా కథనాల్ని వండి వార్చేస్తోంది.