breaking news
brigitte macron
-
మాక్రాన్‌కు చెంపదెబ్బ?
పారిస్: వియత్నాం పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఉదంతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను తీవ్ర ఇబ్బందులపాలు చేసింది. అధికారిక పర్యటన నిమిత్తం భార్య బ్రిగెట్తో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం హనోయ్ చేరుకున్నారు. తలుపు తెరుచుకుని, విమానం దిగేందుకు సిద్ధమవుతున్న క్రమంలో బ్రిగెట్ ఒక్కసారిగా మాక్రాన్ ముఖంపై కొడుతున్నట్టుగా కన్పించారు. ఆమె చేతులు మాక్రాన్ ముఖంపై విసురుగా పడుతూ కన్పించాయి. ఆ ధాటికి మాక్రాన్ ఉన్నట్టుండి వెనక్కు ఒంగిపోయారు. దాంతో ఆయన ఒక్కసారిగా కంగుతిన్నా, కెమెరాలన్నీ తనపైనే ఉండటం గమనించి వెంటనే సర్దుకున్నారు. చిరునవ్వుల నడుమ అభివాదసూచకంగా చేతి ఊపుతూ విమానం నిచ్చెనపైకి చేరుకున్నారు. ఆ వెనకే బ్రిగేట్ కూడా వచ్చి మాక్రాన్ పక్కన నుంచున్నారు. కానీ ఆయన చెయ్యందివ్వబోగా పట్టించుకోలేదు. ఇద్దరూ కలి‘విడి’గానే నిచ్చెన దిగి వచ్చారు. మీడియా కెమెరాలకు చిక్కిన ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడమే గాక తీవ్ర దుమారం కూడా రేపింది. పైగా, ఆ వీడియో నకిలీది కావచ్చన్న ఫ్రెంచి ప్రభుత్వ వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు తావిచ్చాయి. దాంతో ఇక లాభం లేదని అధ్యక్షుడే స్వయంగా రంగంలోకి దిగారు. అదో సరదా ఘటన తప్ప ఇంకేమీ కాదంటూ మీడియా సాక్షిగా వివరణ ఇచ్చుకున్నారు. ‘‘నేను, మా ఆవిడ జోక్ చేసుకుంటున్న క్రమంలో జరిగిన ఉదంతమది. ఏమీ లేనిదాన్ని అనవసరంగా పెద్దది చేసి చూస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. దానిపై ఎవరికి తోచించి వాళ్లు ప్రచారం చేస్తూ అనవసరంగా కుట్ర సిద్ధాంతాలకు తెర తీస్తున్నారంటూ ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో వాపోయింది. మాక్రాన్ దంపతుల నడుమ విభేదాలు సాగుతున్నాయని, అవి తారస్థాయికి చేరాయనేందుకు ఈ ఉదంతమే తాజా నిదర్శనమని ఫ్రెంచి పత్రికలు ఎడాపెడా రాసేయడమే అందుకు కారణం. ఏక్ చోటీ సీ ప్రేమ్ కహానీ!: మాక్రాన్, బ్రిగేట్ బంధం తొలినుంచీ వార్తల్లోనే నిలుస్తూ వచ్చింది. మాక్రాన్ కంటే ఆమె దాదాపు పాతికేళ్లు పెద్దది కావడం విశేషం! బ్రిగేట్ 1953 ఏప్రిల్ 13న పుట్టగా మాక్రాన్ జన్మదినం 1977 డిసెంబర్ 21. అంతేకాదు, హైసూ్కలు రోజుల్లో మాక్రాన్‌కు బ్రిగేట్ టీచర్ కూడా! ఆయనకు ఫ్రెంచ్, లాటిన్ బోధించేవారు. అలా లైసీ లా ప్రావిన్స్‌లో మాక్రాన్ టీనేజీ బాలునిగా చదువుకునే రోజుల్లోనే, అంటే 1993లో వారి ప్రేమ కథకు బీజం పడింది. అప్పటికి ఆయనకు కేవలం 15 ఏళ్లు. కాగా, బ్రిగేట్కు 39 ఏళ్లు. ఆంద్రె లూయిస్ అనే బ్యాంకర్‌తో ఆమెకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. పైగా బ్రిగేట్ పెద్ద కూతురు లారెన్స్ మాక్రాన్‌కు స్వయానా క్లాస్మేట్ కూడా! అయినా ఇవేవీ వారి ప్రేమకు అడ్డంకి కాలేకపోయాయి. బ్రిగేట్ ఓ నాటక సంఘానికి పర్యవేక్షకురాలిగా కూడా వ్యవహరించేవారు. సాహితీ అభిమాని అయిన మాక్రాన్ అందులో సభ్యునిగా చేరారు. స్కూలు వేళలు అయిపోయాక ఇద్దరూ అక్కడ కలుసుకునేవారు. ఎంత గోప్యంగా ఉంచినా వారి వ్యవహారం మాక్రాన్ ఇంట్లో తెలిసిపోయింది. మాక్రాన్ ప్రేమలో పడ్డట్టు అప్పటికే వాళ్లకు అనుమానంగా ఉండేదట. అయితే, అది బ్రిగేట్ కూతురు కావచ్చని వాళ్లు భావించారట! మాక్రాన్ మహా మేధావి అంటూ ఆ అమ్మాయి వారితో నిత్యం ఎంతో గొప్పగా చెప్పడమే అందుకు కారణం. తీరా చూస్తే తమవాడు ప్రేమలో పడింది పిల్లతో కాదు, తల్లితోనని తెలిసి వారు కంగుతిన్నారు! ఈ అసాధారణ ప్రేమ వ్యవహారానికి ఎలాగైనా ఫుల్స్టాప్ పెట్టాలని పై చదువుల పేరిట మాక్రాన్‌ను ఉన్నపళంగా పారిస్ పంపించేశారు. అలా 17వ ఏట హైసూ్కల్ ఫైనలియర్ కోసం ఆయన పారిస్ వెళ్లాల్సి వచ్చింది. ఆ దూరం కూడా వారి ప్రేమకు అడ్డం కాలేకపోయింది. పైగా మాక్రాన్ పారిస్ వెళ్లేముందు, ‘నువ్వేం చెప్పినా, ఏం చేసినా నేను మాత్రం ఎప్పటికైనా నిన్నే పెళ్లాడతా’ అని బ్రిగేట్కు కుండబద్దలు కొట్టి మరీ వీడ్కోలు తీసుకున్నారట. తర్వాత ఇద్దరూ తరచూ లేఖలు రాసుకుంటూ, వీలైనప్పుడల్లా కలుసుకుంటూ ఉండేవారు. కొంతకాలానికి ఆమె కూడా పారిస్ చేరుకున్నారు. అలా పుష్కర కాలం పాటు ప్రేమించుకున్నాక బ్రిగేట్ తన భర్తకు విడాకులిచ్చి 2007లో మాక్రాన్‌ను పెళ్లాడారు. తొలి వివాహం ద్వారా ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. -
‘నా భార్య నన్ను కొట్టలే’.. ఫ్రాన్స్ అధ్యక్షుడు
యూరప్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మొహం మీద ఆయన సతీమణి బ్రిగిట్టే మేక్రాన్ కొట్టారంటూ ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను బ్రిగిట్టే నిజంగా కొట్టారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?దాదాపూ పదేళ్ల తర్వాత అధ్యక్షుడు మేక్రాన్ సౌత్ ఈస్ట్ ఆగ్నేయాసియా దేశాల్లో సుదీర్ఘ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆగ్నేయాసియా దేశాలతో అమెరికా, చైనాకు ఫ్రాన్స్ ప్రత్యామ్నాయమనే సంకేతాలిచ్చేలా డిఫెన్స్, ఎనర్జీ, టెక్నోలజికల్ ఇన్నోవేషన్‌తో పాటు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.ఈ పర్యటనలో భాగంగా మే 25న వియత్నాం రాజధాని హనోయిలో అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో హనోయి నోయి బాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆ సమయంలో జరిగిన ఓ ఊహించని ఘటన మీడియా కంట పడింది. ప్రస్తుతం ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చకు దారి తీసింది.Bizarre moment Emmanuel Macron is slapped by his wife Brigitte pic.twitter.com/kYsE5MCDV1— The Sun (@TheSun) May 26, 2025 అసలేమైందంటే? మేక్రాన్, బ్రిగిట్టేలు ప్రత్యేక విమానం లోపలి నుంచి బయటకు వచ్చే సమయంలో విమానం డోర్లు తెరుచుకున్నాయి. అయితే, ఆ డోర్ ఓపెన్ అయ్యే సమయంలో బ్రిగిట్టే తన రెండు చేతులతో మేక్రాన్ మొహం మీద కొట్టిన దృశ్యాలు కనిపించాయి. బ్రిగిట్టే చేతులు తన మొహం మీద తగలడంతో వెంటనే తన తలను వెనక్కి జరిపారు. దీంతో మేక్రాన్‌ను బ్రిగిట్టే కొట్టారంటూ అంతర్జాతీయ మీడియా వీడియోల్ని ప్రసారం చేశాయి.అందుకు ఊతం ఇచ్చేలా ఈ ఘటన తర్వాత తన చేతిని పట్టుకోమని బ్రిగిట్టేకు తన చేతిని అందించబోయాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. తిరస్కరించింది. కోపంగా అక్కడి నుంచి కదిలింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.ఈ ఘటనపై మేక్రాన్‌ను మీడియా మాట్లాడారు. వైరల్ అవుతున్న వీడియోల్లో నిజం లేదన్నారు. భార్య బ్రిగిట్టే తనను కొట్టలేదని, తాము ఎప్పుడూ ఇలాగే సరదాగా గొడవ పడుతూ ఉంటామని అన్నారు. కానీ, ఆ వీడియోలో కనిపిస్తున్న సీరియస్‌నెస్‌ను చూస్తే మాత్రం మేక్రాన్ అబద్దం చెబుతున్నాడనే విషయం స్పష్టమవుతోందటూ అంతర్జాతీయ మీడియా కథనాల్ని వండి వార్చేస్తోంది. -
‘వారందరికీ మా అమ్మపై అసూయ’
పారిస్: పిన్న వయసులోనే ఫ్రాన్స్ అధ్యక్ష పదవి దక్కించుకున్న వ్యక్తిగా ఎమ్మాన్యుయల్ మాక్రాన్ గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుండగా అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ఆయన భార్య గురించి చర్చ మొదలైంది. అయితే, మొన్నటి వరకు బాహాటంగా ఆ విషయంపై స్పందించని మాక్రాన్ తాజాగా ఓ పర్షియన్ వార్తా పత్రికకు ఈ వారం ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నేను నా భార్యకంటే 20 ఏళ్లు పెద్దవాడినై ఉంటే ఎవరూ అడిగే వారు కాదు కదా! మరో ప్రశ్న వేసే వారు కదా’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరిగిన ఎన్నికలకు వాషింగ్టన్ పోస్ట్ తరుపున బాధ్యతలు నిర్వహిస్తున్న మేరీ జోర్డాన్‌తో చాలా మంది మాక్రాన్ వివాహంపై స్పందిస్తూ ఎన్నో ఏళ్లుగా ఫ్రాన్స్‌ను ఏలే నేతలంతా కూడా తమకంటే చాలా చిన్నవారినే వివాహం చేసుకుంటూ వచ్చారని, ముదుసలి వయసులో ఉన్నవారు కూడా యువతులను పెళ్లాడేవారని, అలాంటి చర్యలపై మాక్రాన్ వివాహం ఒక సోషల్ రివెంజ్లాంటిదంటూ చెప్పారు. మాక్రాన్ వయసు ప్రస్తుతం 39 ఏళ్లుకాగా, ఆయన భార్య బ్రిగిట్టే మాక్రాన్ వయసు ప్రస్తుతం 64 ఏళ్లు. వీరిద్దరి మధ్య దాదాపు 25 ఏళ్ల గ్యాప్ ఉంది. ఈ విషయంపై అడ్డగోలుగా వ్యాఖ్యానాలు బయలుదేరాయి. ముఖ్యంగా ఆయన అధ్యక్ష రేసులోకి వచ్చాక ఎక్కువయ్యాయి. దీంతో ఇమ్మాన్యుయెల్ తన వివాహాన్ని సమర్థించుకోగా ఆయన తోడుగా టిపాయినే అజైర్ తోడయ్యారు. ఈమె బ్రిగిట్టే కుమార్తె. ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్న ఈమె అడ్డగోలు వ్యాఖ్యానాలపై స్పందించారు. ప్రస్తుతం ఎవరైతే తన తల్లిపై విమర్శలు చేస్తున్నారో వారంతా కూడా అసూయతోనే చేస్తున్నారే తప్ప వేరే ఉద్దేశం కాదంది. వారు అపకుండా ఇలాగే అన్నా పెద్దగా వచ్చే నష్టమేమి లేదని, ప్రజలకు మరింత దగ్గరవుతామంటూ తిప్పికొట్టింది. తనకంటే వయసులో పెద్దదైన భార్యను కలిగి ఉన్న తొలి అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ కానున్నారు.