ప్రపంచంలోనే ఉత్తమ శబ్దం ఇది | This cheetah Adorable Purring Sound Is Music To Netizens | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే ఉత్తమ శబ్దం ఇది

Aug 9 2020 5:03 PM | Updated on Aug 9 2020 5:42 PM

This cheetah Adorable Purring Sound Is Music To Netizens - Sakshi

ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుత అని మనందరికి తెలుసు. జంతువులను వేటాడే క్రమంలో అది పరుగెత్తినట్లు మరే జంతువు పరుగెత్తలేదు. అయితే ఇంత వేగంగా పరుగెత్తే జంతువు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు శబ్దం ఎలా చేస్తుందో  అందరికి తెలియదు. ఇప్పుడు ఆ శబ్దం ఎలా ఉంటుందో ఈ వీడియో తెలియజేస్తుంది. దాని శబ్దం మీ చెవికి వినసొంపుగా ఉంటుంది.  దీన్ని ఆస్ట్రేలియాలో ఉన్న వైల్డ్ క్యాట్ కన్జర్వేషన్ సెంటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. (రూపాయి ఖర్చు లేకుండా ఆడిలో షికారు!)

కేర్‌ టేకర్‌ ఓ అందమైన చిరుత గడ్డం నిమురుతూ ఉండగా, అది హాయిగా నిద్రపోతోంది. ఆ సమయంలో చిరుత నుంచి వచ్చే శబ్దం సంగీతం విన్నట్లుగా ఉంది. ఈ వీడియోను వైల్డ్‌ క్యాట్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ‘ప్రపంచంలోనే ఉత్తమైన శబ్దం ఇది’అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గడ్డం నిమురుతూ ఉంటే చిరుత పొందిన శాంతికి నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఇంతకంటే హాయిదనం ఏముంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement