వామ్మో.. నీళ్లన్నీ తాగేస్తున్న చాట్‌జీపీటీ, ఇలా అయితే కష్టమే!

Chatgpt Drinks 500ml Water To Answer 50 Questions, Researchers Warns - Sakshi

విడుదలైన కేవలం రెండు నెలల్లోనే వంద కోట్లమంది యూజర్లతో ప్రపంచాన్ని చుట్టేసింది చాట్‌జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతో ఎన్నె అద్భుతాలు చేస్తున్న అందరి నోట ఔరా అనిపించింది. దిగ్గజ సంస్థలకు సైతం పోటీగా నిలబడే స్థాయికి చేరుకుంటోంది. అయితే ఇదంతా  ఇప్పటి వరకు మనకు పైకి తెలిసిన విషయం మాత్రమే. కాయిన్‌కు రెండు వైపుల ఉన్నట్లు చాట్‌జీపీటీ కూడా రెండో వైపు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌పిట్‌ని పరీక్షిస్తు‍న్నారా…? చాట్‌జీపీతో ఒక అంశం ఆధారంగా కథనం, కథ లేదా కవిత రాయాలనే ఆసక్తి ఉన్నవారు ఇంకో విషయం తెలుసుకోవాలి...! ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజూ ఇలా ChatGPTని ఉపయోగిస్తున్నందున, మనం దీనికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.


యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్‌సైడ్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్‌టన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో..  20-50 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు చాట్‌జీపీటీకి దాదాపుగా అర లీటరు నీరు అవసరం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అసలు చాట్‌జీపీటీకి, నీటి మధ్య సంబంధం ఏమిటంటే.. ChatGPT వంటి  ఏఐ మోడల్‌లను అమలు చేస్తున్నప్పుడు ఆ సర్వర్‌లను చల్లబరచడానికి పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయట.


డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి నీటి వినియోగాన్ని లెక్కగట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. పైగా ఇందుకు మంచి నీటినే వినియోగించాల్సి ఉంటుందట.  జీపీటీ-3కి శిక్షణ ఇవ్వడానికే మైక్రోసాఫ్ట్‌ 7 లక్షల లీటర్ల నీటిని వినియోగించడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. చాట్‌ జీపీటీకి కోట్ల మంది యూజర్లు ఉన్నందున డాటా సెంటర్లకు భారీగా నీటి వినియోగం ఉంటున్నదని ఈ అధ్యయనంలో బయటపడింది. ఇదే కాకుండా ఇతర సంస్థల ఏఐ మాడళ్లు కూడా భారీగా నీటిని వినియోగిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 

చదవండి: ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top