ఎన్నికల ప్రచారంలో 500 కేజీల ఎలుగు బంటి

California Governor Candidate Brings Kodiak Bear To Campaign - Sakshi

కాలిఫోర్నియా : ఎన్నికల ప్రచారాలు కొత్త పుంతలు తొక్కుతున్న రోజులివి. తమకంటూ జనాల్లో ఓ గుర్తింపు రావాలన్న కసితో కొత్త కొత్త దార్లు వెతుక్కుంటున్నారు అభ్యర్థులు. తాజాగా, అమెరికాలో ఓ గవర్నర్‌ అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి ఏకంగా ఎలుగు బంటిని తీసుకువచ్చాడు. వివరాలు.. జాన్‌ కాక్స్‌.. కాలిఫోర్నియా గవర్నర్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థి. మంగళవారం ‘బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌’ అనే అంశం మీద ఆయన ప్రచారం నిర్వహించాడు. ప్రస్తుత డెమోక్రటిక్‌ పార్టీ గవర్నర్‌ గేవిన్‌ న్యూసమ్‌ను బ్యూటీగా.. తనను తాను ఓ బీస్ట్‌గా చెప్పుకొచ్చాడు. తన ఎన్నికల ప్రచార జెండాపై కూడా ఎలుగు బంటి బొమ్మను ముద్రించాడు. అందుకే అందరికీ తన గుర్తు గుర్తుండిపోయేలా కొడియక్‌ జాతికి చెందిన ఓ పేద్ద గోధుమ రంగు ఎలుగు బంటిని ప్రచారానికి తెచ్చాడు.

దాని పేరు ‘ట్యాగ్‌’. అది దాదాపు 500 కిలోల బరువుంది. ఎలుగు బంట్ల జాతిలో అదే పెద్దది. అది సినిమాలకోసం, టీవీ సిరీస్‌ కోసం ట్రైనింగ్‌ ఇచ్చినది కావటంతో ప్రచారంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రచారం సందర్భంగా జాన్‌ కాక్స్‌ మాట్లాడుతూ.. ‘‘ కాలిఫోర్నియాను అభివృద్ధి చేయటంలో అందగాళ్లైన రాజకీయనాయకులు ఓడిపోయారు. కాలిఫోర్నియాను రక్షించుకోవటానికి పెద్ద మార్పులు అవసరం. టాక్సులు కట్‌ చేస్తా.. కాలిపోర్నియాను అభివృద్ధి పథంలో నడిపిస్తా’’ నని అన్నారు.

చదవండి, చదివించండి : వైరల్‌: ఆ రెండిటికీ తేడా తెలియకపోతే ఇలానే ఉంటుంది

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top