Monkeypox: బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్‌ మరణం.. అందుకే చనిపోయాడు!

Brazil First Non African Coutry Recorded First Monkeypox Death - Sakshi

బ్రెసిలియ: మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి వారం గడవక ముందే మరిన్ని దేశాలకు వైరస్‌ విస్తరించింది. తాజాగా ప్రపంచంలో బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్‌ మరణం రికార్డు అయ్యింది. 

మంకీపాక్స్‌ మొదటగా వెలుగు చూసింది ఆఫ్రికాలోనే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆఫ్రికా దేశాల్లోనే అత్యధిక మంకీపాక్స్‌ కేసులు, మరణాలు సంభవించాయి. అయితే తొలిసారిగా ఓ బయటిదేశంలో మంకీపాక్స్‌ మరణం నమోదు కావడం విశేషం. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌లో 41 ఏళ్ల వ్యక్తి Monkeypoxతో మరణించాడని అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. 

👉🏽 బ్రెజిల్‌ రాష్ట్రం మినాస్‌ గెరాయిస్‌ రాజధాని బెలో హోరిజోంటేలో సదరు వ్యక్తి మంకీపాక్స్‌తో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అయితే అతనిలో రోగనిరోధక వ్యవస్థ(ఇమ్యూనిటీ) అత్యంత బలహీనంగా ఉందని, రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. 

👉🏽 ఇదిలా ఉంటే.. జూన్‌ 10వ తేదీన యూరప్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు బయటపడ్డాయి. వైరస్‌ నిర్ధారణ కావడంతో బ్రెజిల్‌లో తొలి కేసు నమోదు అయ్యింది. ఇప్పటిదాకా వెయ్యి దాకా మంకీపాక్స్‌ కేసులు బ్రెజిల్‌లో నమోదు అయ్యాయి. సావో పాలో, రియో డీ జనెరియోలోనే ఎక్కువ కేసులు వెలుగు చూశాయి.   

👉🏽జ్వరం, హై ఫీవర్‌, వాపు లక్షణాలు, చికెన్‌పాక్స్‌ తరహా ఒంటిపై దద్దర్లు తదితర లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

👉🏽డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. మంకీపాక్స్‌ ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమైన వైరస్‌. కానీ, ఈ మధ్య బయటి దేశాల్లోనూ విజృంభిస్తోంది. ఇప్పటిదాకా 78 దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. 70 శాతం యూరప్‌ దేశాల్లో, 25 శాతం అమెరికాలో బయటపడ్డాయి.

👉🏽 మంకీపాక్స్‌ ఎవరికైనా సోకవచ్చు. గట్టిగా తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా మంకీపాక్స్‌ ఒకరి నుంచి ఒకరిని వ్యాపిస్తోంది. చికిత్సతో వైరస్‌ నుంచి బయటపడొచ్చు.

👉🏽 అయితే ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లో ఎక్కువ శాతం కేసులు లైంగిక ధోరణి వల్లే నమోదు అయ్యాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన WHO.. సెక్స్‌ పార్ట్‌నర్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు సైతం జారీ చేసింది.

చదవండి: మంకీపాక్స్‌తో సీరియస్‌ అయితే ఈ టీకా వాడొచ్చు!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top