BioNTech: త్వరలో క్యాన్సర్‌ వ్యాక్సిన్‌!

BioNTech: Cancer vaccine could be available before 2030 - Sakshi

ఎనిమిదేళ్ల లోపే అందుబాటులోకి

పరిశోధక, వైద్య దంపతుల రూపకల్పన

క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి ఇక ఎంతో సమయం పట్టదని ఈ ప్రాణాంతక వ్యాధిపై సుదీర్ఘ కాలంగా పరిశోధన చేస్తున్న దంపతులు, ‘బయో ఎన్‌టెక్‌’ వ్యాక్సిన్ల తయారీ సంస్థ అధినేలు ప్రొఫెసర్‌ ఉగుర్‌ సాహిన్, ప్రొఫెసర్‌ ఓజ్లెమ్‌ టురేసి చెబుతున్నారు. మహా అయితే ఎనిమిదేళ్లలోపే క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ వాడుకలోకి రాబోతోందని వివరించారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ఇంటర్వ్యూలో వారు ఈ మేరకు వెల్లడించారు.

‘‘మేం డాక్టర్లుగా బాధితుల వెతలు, నిరాశా నిస్పృహలు చూసి చలించిపోయేవాళ్లం. ఆ అనుభవమే క్యాన్సర్‌ పరిశోధనల వైపు మళ్లించింది’’ అన్నారు. ‘‘కరోనాకు మంచి వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న క్రమంలో ఆ పరిశోధన అనుకోకుండా క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేలా మలుపు తిరిగింది. ఇది మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్‌. మన ఒంట్లోని వ్యాధినిరోధక శక్తే క్యాన్సర్‌ కణాలను గుర్తించి తుదముట్టించేలా ఇది పని చేస్తుంది’’ అని డాక్టర్‌ సాహిన్‌ చెప్పారు.

తమ వ్యాక్సిన్‌ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని ఘంటాపథంగా చెప్పారు. అది క్యాన్సర్‌ కణాలను నేరుగా తుదముట్టించేలా రూపొందిందని టురేసి వివరించారు. ‘‘ట్రయల్స్‌లో బాధితులపై  వ్యాక్సిన్‌ను వాడుతున్నప్పుడు ఎదురైన అడ్డంకులు దీన్ని మరింత ప్రభావవంతంగా మార్చేలా చేశాయి’’ అని దంపతులు చెప్పారు. ఈ పరిశోధనల వివరాలు తొలుత బిజినెస్‌ ఇన్‌సైడర్‌ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top