ఎంతో మందిని చదివించాడు కానీ పన్నులు ఎగ్గొట్టాడు

Billionaire Philanthropist Robert Smith Admits Evading Taxes for Years - Sakshi

వాషింగ్టన్‌: రాబర్ట్‌ స్మిత్‌ ఈ పేరు చాలా మందికి తెలిసే వుంటుంది. ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ విస్తా ఈక్విటీ పార్ట్‌నర్‌ను స్థాపించి ఆ బిజినెస్‌లో ఉన్నత స్థానానికి ఎదిగారు. అంతే కాకుండా ఆయన గొప్ప మానవతావాది. గతేడాది మోర్‌ హౌస్‌ కాలేజీలో ఉన్న గ్రాడ్యూయేట్‌ విద్యార్థుల అందరి ఫీజులు చెల్లించి తన మంచితనాన్ని చాటుకున్నారు. ఇదిలావుండగా స్మిత్‌ 15ఏళ్లుగా వేలకోట్ల రూపాయల పన్ను ఎగ్గొటారని శాన్‌ఫ్రాన్సిస్కో ఆటర్నీ డేవిడ్‌ ఆండర్సన్‌ తెలిపారు. 

అమెరికాలోనే అత్యంత ట్యాక్స్‌ కుంభకోణం రెండు బిలియన్‌ డాలర్ల కేసులో నేరస్తుడిగా ఉన్న రాబర్ట్‌ బ్రోక్‌మన్‌ కేసు విచారణలో స్మిత్‌ను విచారించారు. అందుకు సహకరించడానికి స్మిత్‌ ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే స్మిత్‌ 15 ఏళ్లుగా వివిధ రకాల ట్రస్ట్‌లు, కార్పొరేషన్ల ద్వారా ఫారెన్‌ ఫండ్లను తప్పుదారి పట్టించి వాటి ట్యాక్స్‌ ఎగ్గొట్టినట్టు డేవిడ్‌ ఆండర్సన్‌ తెలిపారు. ఇక వీటికి సంబంధించి 139 మిలియన్‌ డాలర్లు చెల్లించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అధికారులు మరిన్ని విషయాలను సేకరిస్తున్నారు. చదవండి: ప్రధానివా.. మోడల్‌వా? 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top