రికార్డు సృష్టిస్తున్న ఒబామా పుస్తకం 

Barack Obama A Promised land Book Sold 8 lakh Above Copies In 24 Hours - Sakshi

న్యూయార్క్ ‌: యూఎస్‌ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రచించిన ‘‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’’పుస్తకం రికార్డులు సృష్టిస్తోంది. రిలీజైన తొలి 24 గంటల్లో ఈ బుక్‌ 8.9 లక్షల కాపీలు అమ్ముడైంది. ఆధునిక అమెరికా చరిత్రలో బెస్ట్‌ సెల్లింగ్‌ ప్రెసిడెన్షియల్‌ రచనగా నిలవనుంది. పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ విడుదల చేసిన ఈ పుస్తకం అమ్మకాలకు దగ్గరలోకి వచ్చే పుస్తకం ఒబామా భార్య మిషెల్‌ రచించిన ‘‘బికమింగ్‌’’ కావడం విశేషం. బుధవారానికి అమెజాన్, బారన్స్‌ అండ్‌ నోబుల్‌ డాట్‌కామ్‌ సైట్లలో ఒబామా బుక్‌ నంబర్‌ 1 స్థానంలో ఉంది. పది రోజుల్లో అమ్మకాలు మరిన్ని రికార్డులు సృష్టించవచ్చని అంచనాలున్నాయి.

గతంలో బిల్‌ క్లింటన్‌ రచన ‘‘మైలైఫ్‌’’4 లక్షల కాపీలు, బుష్‌ రచన ‘‘డెసిషన్‌ పాయింట్స్‌’’2.2 లక్షల కాపీల మేర తొలిరోజు అమ్ముడయ్యాయి. ఒబామా పుస్తకం విడుదలైన సమయంలో దేశంలో అనిశ్చితి, సంక్షోభం(ఎన్నికలు, కరోనా తదితరాలు) నెలకొని ఉన్నా పుస్తక ప్రియులు మాత్రం విశేషంగా స్పందించారు. పుస్తకం ఆరంభించిన సమయంలో ఎన్నికల ఫలితాల నాటికి విడుదల చేయాలని తాను అనుకోలేదని ఒబామా చెప్పారు. గతంలో ఒబామా రచించిన ‘‘డ్రీమ్స్‌ ఫ్రమ్‌ మై ఫాదర్‌’’, ‘‘ద ఆడిసిటీ ఆఫ్‌ హోప్‌’’ పుస్తకాలు సైతం విశేష ఆదరణ పొందాయి. పలువురు రివ్యూ రచయితలు తాజా పుస్తకాన్ని ప్రశంసించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top