
ఢాకా: పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనాపై 2024లో విద్యార్థుల సారథ్యంలో మొదలైన ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్(ఐసీటీ)ఆదివారం విచారణను ప్రారంభించింది.
ఈ కేసులో సహ నిందితులుగా మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమాల్‌ను, మాజీ ఐజీపీ అబ్దుల్లా అల్ మమూన్‌లను చేర్చింది. ఆపద్ధర్మ ప్రభుత్వం చీఫ్ ప్రాసిక్యూటర్‌గా తాజుల్ ఇస్లాంను నియమించింది. అన్ని నేరాలకు హసీనాయే కేంద్రమని, ఆమెకు గరిష్ట శిక్ష విధించాలని కోర్టును తాజుల్ ఇస్లాం కోరారు.గతేడాది మొదలైన విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసేందుకు హత్యలు, చిత్రహింసలకు పాల్పడ్డారంటూ ఐసీటీ హసీనాపై ఆరోపణలు మోపింది.