పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..

Astrophotographer Andrew McCarthy Snaps His Clearest Ever Photo SUN - Sakshi

Astrophotographer Andrew McCarthy Sun Photo: సుడులు తిరుగుతున్న లావాలా ఉన్న అగ్నిగోళం ఉపరితలం... పసుపు, ఎరుపు కలగలిసిన ఈకలను తలపిస్తున్న భానుడి భగభగలు... అక్కడక్కడా నల్లటి చుక్కలు... సూర్యుడిని అతి సమీపం నుంచి చూస్తున్నట్టుగా ఉన్నది కదూ! ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని ఆస్ట్రోఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ మెక్‌ కాతీ పట్టి బంధించాడు. నిప్పులు కక్కుతున్న ఆ నిండు సూర్యుడిని... ఓ సోలార్‌ ఆర్బిటార్‌ తీసినంత స్పష్టంగా తన కెమెరాలో కట్టిపడేసిన ఆండ్రూ... సూర్యుడిని అంత సమీపంగా, అంత అద్భుతంగా చిత్రీకరించిన మొట్టమొదటి ఫొటోగ్రాఫర్‌.

(చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్‌’..ఎందుకో తెలుసా?)

ఇందుకోసం 300 మెగాపిక్సల్స్‌ కలిగిన కెమెరాను ఉపయోగించాడు. ఇది... సాధారణ కెమెరాకంటే 30 రెట్లు అధికం. ఒక్క పర్ఫెక్ట్‌ చిత్రం కోసం... ఆయన లక్షా యాభైవేల చిత్రాలను తీసి, వాటిని లేయర్‌ చేశాడు. నల్లటి చుక్కలను ఫొటోషాప్‌తో ఎడిటింగ్‌ చేశాడు. సాధారణంగా ఇలాంటివి తీస్తున్నప్పుడు మంటలు వచ్చే ప్రమాదం ఉంది. కళ్లు కూడా పోవచ్చు. వీటిని నివారించడానికి రెండు ఫిల్టర్లు ఉన్న ప్రత్యేక టెలిస్కోప్‌ వాడాడు. ‘ఆకాశాన్ని ఆవిష్కరించాలనుకున్నప్పుడు అందరూ చంద్రుడినే బెంచ్‌మార్క్‌గా చూస్తారు. కానీ సూర్యుడిని క్యాప్చర్‌ చేయడం నన్ను ఉత్సాహపరిచే అంశం. ఎందుకంటే సూర్యుడెప్పుడూ బోర్‌ కొట్టడు. తీసిన ప్రతిసారీ కొత్తగా కనిపిస్తాడు’అని ఆండ్రూ చెబుతున్నాడు. 

(చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top