వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!

Asia Biggest Flower Market Makes Stars Out of Influencers in China - Sakshi

ఆసియాలోని అతిపెద్ద పూల మార్కెట్‌ అయిన చైనా పూల మార్కెట్‌ రోజుకి వేలాదిమంది కస్టమర్ల ఆర్డర్‌లతో కళకళలాడుతుంది. ఇ-కామర్స్ అనేది చైనాలో అతి పెద్ద వ్యాపారం. అయితే ఇంతవరకు ఆన్‌లైన్‌లో సౌందర్య సాధనాలకు సంబంధించిన లగ్జరీ బ్రాండ్‌ల విక్రయాలతో శరవేగంగా దూసుకుపోయింది. కానీ ఇప్పడూ మాత్రం అనుహ్యంగా ఆన్‌లైన్‌ పూల మార్కెట్‌ మంచి ఆదాయ వనరుగా శరవేగంగా పుంజుకుంటుంది. అంతేకాదు ప్రజలంతా తమ స్మార్ట్‌ ఫోన్‌ల సాయంతో ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన పూల బోకేలను లేదా పూలను ఆర్డర్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చైనా పేర్కొంది.

(చదవండి: అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!)

పైగా చైనా దేశం తమ ఉద్యాన పరిశ్రమ ఆదాయం సుమారు 160 బిలియన్ యువాన్ల (రూ.180 కోట్లు) గా అంచనా వేసింది. అంతేకాదు ఈపూల మార్కెట్‌కి సంబంధించిన ఆన్‌లైన్ రిటైల్ ఇప్పుడు సెక్టార్ టర్నోవర్‌లో సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ మేరకు ఐదు పుష్పగుచ్ఛాలు, వెంటనే ఆర్డర్ చేసే వారికి కేవలం 39.8 యువాన్లు (రూ.468) మాత్రమే అంటూ చక్కటి ఆకర్షించే ఆఫర్లతో కస్టమర్లను మైమరిపించి కొనేలా చేస్తుంది. దీంతో ఆయా ఆన్‌లైన్‌ వ్యాపారా సంస్థలకు సంబంధించిన తమ రోజు వారి ఆదాయాలు మారుతూ వస్తున్నాయి. అంతేకాదు చైనాలో జీవన ప్రమాణాలు పెరగడం వల్ల కట్ ఫ్లవర్‌లకు డిమాండ్ పెరగడంతో దక్షిణ ప్రావిన్స్ యునాన్ ఆ విజృంభణకు కేంద్రంగా మారింది.

పైగా ప్రాంతీయ రాజధాని కున్మింగ్ ఆసియాలోనే అతిపెద్ద పూల మార్కెట్‌ను కలిగి ఉంది. పైగా నెదర్లాండ్స్‌లోని ఆల్స్‌మీర్ తర్వాత ఇదే ప్రపంచంలో రెండవ అతిపెద్దది  పూల మార్కెట్‌. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా స్థంభించిపోయిన ఈ పూల మార్కెట్‌ ప్రస్తుతం ఈ ఆన్‌లైన్‌ విక్రయాలతో ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ మేరకు ప్రజలు కూడా ఈ మహమ్మారీ భయంతో ఆన్‌లైన్‌లోనే విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నటు చైనా వ్యాపార​ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రతిరోజూ సగటున నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ పువ్వులు అమ్ముడవుతున్నాయని, పైగా చైనా ఒక్క వాలెంటైన్స్ డే రోజునే దాదాపు 9.3 మిలియన్లను విక్రయిస్తుందని అంటున్నారు.

(చదవండి: దేశంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top