హ్యాట్సాఫ్‌!..కుక్కని భలే రక్షించాడు

Amazon Delivery Driver Herself In Front Raging Pit Bulls Viral - Sakshi

ఒక్కోసారి సంభవించే అనుహ్యమైన ప్రమాదాలు లేదా జంతువులు దాడులు చాలా భయానకంగా ఉంటాయి. పైగా ఎలా తప్పించుకోవాలో కూడా తెలియదు. అచ్చం అలాంటి ఘటనే ఒక కస్టమర్‌ కుమార్తెకి ఎదురైంది.

(చదవండి: పారా సెయిలింగ్‌ మళ్లీ ఫెయిల్‌ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!)

అసలు విషయంలోకెళ్లితే...అమెరికాలోని స్టెఫానీ లాంట్జ్ సబర్బన్ లాస్ వెగాస్‌లో అమెజాన్ డెలివరీ డ్రైవర్ లిడే ప్యాకేజీలను డెలివరీ చేస్తుంటాడు. ఇంతలో ఒక కస్టమర్‌ కుమార్తె 19 ఏళ్ల లారెన్ రే బయటకు వచ్చింది. అనుకోకుండా అక్కడ ఒక వీధి కుక్క ఆమె వద్దకు వచ్చింది. అయితే ఆమె కూడా ఆ కుక్కని చక్కగా పలకరించింది. అంతా బాగానే ఉంటుంది. ఇంతలో ఆమె పెంపుడు కుక్క బయటకు వచ్చింది. అంతే ఆ వీధి కుక్క ఒక్కసారిగా చాలా క్రూరంగా ఆ కుక్క పై దాడి చేసింది.

దీంతో ఆమెకు ఒక్కసారిగా ఏం చేయాలో పాలుపోదు. అయితే ఏదోరకంగా దాన్ని భయపెట్టడానికి ప్రయత్నించినా కూడా అది ఆగదు. పైగా ఆమె పై కూడా దాడి చేసింది. దీంతో అక్కడే ఉన్న అమెజాన్‌ డ్రైవర్‌ వెంటనే స్పందించి ఆ కుక్కను నివారించటమే కాకుండ ఆమె పెంపుడు కుక్క వద్దకు రాకుండా అడ్డుగా నిలబడి ఉంటాడు. ఆ తర్వాత ఆమె తన పెంపుడు కుక్కను తీసుకుని లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ కుక్క కూడా కాసేపటికి నిష్క్రమించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top