Afghanistan Refugees: ‘మౌనంగా ఉండకండి.. అర్థం చేసుకోండి’

Afghanistan Refugees At United Nations Organization Agency Delhi - Sakshi

న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల వశమైన నాటి నుంచి ఆ దేశ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అరాచక పాలనలో తమ బతుకులు బుగ్గిపాలవడం ఖాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే పరిస్థితి ఉందంటూ ఆందోళన పడుతున్నారు. ఈ క్రమంలో వేలాది మంది అఫ్గన్లు దేశం విడిచి పారిపోతుండగా.. మరికొందరు తాలిబన్లను ఎదురించే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, అఫ్గన్‌లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న మెజారిటీ దేశాలు.. అమాయక ప్రజలకు అండగా నిలుస్తూనే.. తాలిబన్ల తీరు పట్ల వ్యూహాత్మక మౌనం, సమదూరం పాటిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశం విడిచి భారత్‌కు చేరిన శరణార్థులు సోమవారం ఢిల్లీలోని యునైటెడ్‌ నేషన్స్‌ హైకమిషనర్‌ ఫర్‌ రెఫ్యజీస్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తాలిబన్ల అరాచకాలపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉండొద్దని నినాదాలు చేశారు. అఫ్గన్‌ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని తమను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. ‘‘మాకు మెరుగైన భవిష్యత్తు కావాలి’’, ‘‘న్యాయం కావాలి’’, ‘‘ఇకనైనా మౌనం వీడండి. మా బాధను అర్థం చేసుకోండి’’ అంటూ తమకు మద్దతుగా నిలవాలని కోరారు. 

చదవండి: ‘వాళ్లిద్దరే దేశాన్ని నాశనం చేశారు.. తాలిబన్లకు ఇదే నా విజ్ఞప్తి’ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top