శ్మశానంలో 8,400 ఏళ్లనాటి శునక అవశేషాలు | 8400 Years Old Dogs Remains Found In Sweden | Sakshi
Sakshi News home page

శ్మశానంలో 8,400 ఏళ్లనాటి శునక అవశేషాలు

Sep 26 2020 8:51 PM | Updated on Sep 26 2020 8:54 PM

8400 Years Old Dogs Remains Found In Sweden - Sakshi

శ్మశాన వాటికలో 8,400 ఏళ్లనాటి శునక అవశేషాలు

స్టాక్‌హోమ్‌ : దక్షిణ స్వీడన్‌లో అతి పురాతన కాలంనాటి శునక అవశేషాలు బయటపడ్డాయి. గత గురువారం అక్కడి ఓ శ్మశాన వాటికలో మధ్య రాతి యుగానికి చెందిన శునక అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఆ శునకాన్ని పాతిపెట్టి దాదాపు 8,400 ఏళ్లయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆకస్మికంగా సముద్ర మట్టం పెరగటం వల్ల శ్మశాన వాటికలోకి వచ్చి చేరిన బురద కారణంగా ఆ ప్రదేశం మొత్తం భద్రపరచబడిందని చెబుతున్నారు. దీంతో అక్కడి అవశేషాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదంటున్నారు. ( వైర‌ల్‌: అత‌డు ముక్కు క‌త్తిరించేసుకున్నాడు! )

ఆ శునకాన్ని ఓ వ్యక్తి పాతి పెట్టాడని, పెంచుకున్నవి చనిపోయినపుడు గుర్తుగా ఏదైనా వదలిపెట్టడం అప్పటి ఆచారం అని చెబుతున్నారు. కాగా, ఆ శునకానికి సంబంధించిన అవశేషాలను ఇంకా భూమిలోంచి బయటకు తీయలేదు. వాటిని వెలికి తీసిన వెంటనే బ్లెకింగ్‌ మ్యూజియానికి తరలించటానికి పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement