కడుపు తరుక్కుపోయే దారుణం.. నోటికి టేప్‌ వేసి, కుక్కల బోనులో బంధించి

6 Year Old Girl Murdered By Adopted Parents Shocked US - Sakshi

అమెరికాలో సంచలనం సృష్టించిన ఆరేళ్ల బాలిక హత్య

అత్యంత పాశవీకంగా బాలికను హత్య చేసిన దత్తత తల్లిదండ్రులు

వాషింగ్టన్‌: ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులకు భారమై అనథాశ్రమంలో చేరారు. ఓ రోజు ఇద్దరు దంపతులు వచ్చి.. ఆ అక్కాచెల్లళ్లను దత్తత తీసుకున్నారు. తల్లిదండ్రుల ప్రేమ, సంరక్షణ దొరికిందని ఆ చిన్నారులు ఎంతో సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేవదు. చిన్నారులను దత్తత తీసుకున్న దంపతులు రాక్షసులు, సైకోలు. ఈ క్రమంలో దత్తత తీసుకున్న వారిలో ఓ చిన్నారిని అత్యంత పాశవీకంగా హత్య చేశారు. ఈ దారుణం అమెరికాలో సంచలనం సృష్టించింది. కనీసం అనాథశ్రమంలో ఉంటేనైనా చిన్నారి బతికి ఉండేది కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికన్లు. ఆ వివరాలు..

హవాయికి చెందిన దంపతులు ఐజాక్ కలువా (52), లెహువా కలువా (43) దంపతులు హత్య గావించబడిన ఇసాబెల్లాను 2018లో దత్తత తీసుకున్నారు. ఇసబెల్లా కంటే ముందు ఆమె సోదరిని 2009లో దత్తత తీసుకున్నారు కలువా దంపతులు. ఆ తర్వాత ఇసబెల్లా మరో ఇద్దరు తోబుట్టువులను 2018, 2020లో దత్తత తీసుకున్నారు. ఇసాబెల్లా తల్లిదండ్రులు వైమన ప్రాంతంలో నివసిస్తుండేవారు. వారు కటిక పేదరికం అనుభవిస్తుండటంతో పిల్లలను కలువా దంపతులకు దత్తతకు ఇచ్చారు. 
(చదవండి: అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష)

కలువా దంపతులు రాక్షసులకు మారుపేరులాంటి వారు. చిన్నారులను దత్తతకు తీసుకున్న వీరు వారిని చిత్రహింసలకు గురి చేసేవారు. ఈ క్రమంలోనే ఆరేళ్ల ఇసాబెల్లాను అత్యంత దారుణంగా హింసించేవారు. చిన్నారికి సరిగా తిండి పెట్టేవారు కారు. ఆకలికి తట్టుకోలేక రాత్రిళ్లు లేచి ఆహారం కోసం వెదికేది ఇసాబెల్లా. 

ఈ క్రమంలో కలువా దంపతులు ఇసాబెల్లాను బంధించడం కోసం కుక్కల బోనును ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తెప్పించారు. చిన్నారిని హత్య జరిగిన నాడు.. రోజు లానే ఇసాబెల్లాకు ఆహారం పెట్టకుండా హింసించారు. రాత్రిళ్లు ఆహారం కోసం వెదకకుండా ఉండేందుకు గాను ఇసాబెల్లా నోటికి, చేతులకు డక్‌ టేప్‌ వేసి కుక్కల బోనులో బంధించారు. ఆ తర్వాత బోనును బాత్రూంలో పెట్టారు.
(చదవండి: కోట్లలో ఒకరు... ఈ కోర్ట్ని!)

ఈ క్రమంలో ఇసాబెల్లా కన్నా ముందు కలువా ఇంటికి దత్తత వచ్చిన ఆమె సోదరి.. చెల్లెలు బెడ్‌ మీద కనిపించకపోవడంతో ఇల్లంతా వెదికింది. బాత్రూంలో కుక్కల బోనులో ఉన్న ఇసాబెల్లాను గుర్తించి.. బెడ్‌రూంలోకి తీసుకువచ్చింది. అప్పటికే ఇసాబెల్లా అపస్మారక స్థితిలో ఉంది. దీని గురించి బాధిత చిన్నారి అక్క కలువా దంపతులకు చెప్పింది. వారు వచ్చి ఇసాబెల్లాను బాత్‌టబ్‌లో పడుకోబెట్టి నీరు పెట్టారు. కానీ ఇసాబెల్లా మేల్కొలేదు.

చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించుకున్న కలువా దంపతులు.. మిగతా పిల్లలకు తెలియకుండా బాలిక మృతదేహాన్ని మాయం చేశారు. దీని గురించి ఎవరికి చెప్పవద్దని ఇసాబెల్లా అక్కను బెదిరించారు. అనంతరం బాత్‌టబ్‌, కుక్కల బోనును ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఐజాక్‌ కలువ తనకు కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయని చెప్పి.. ఆస్పత్రిలో చేరాడు. 
(చదవండి: కాబోయే కోడలు కన్నకూతురని తెలిసింది.. ట్విస్ట్‌ ఏంటంటే )

2021, సెప్టెంబర్‌ 12న ఇసాబెల్లాను హత్య చేసిన నెల రోజుల తర్వాత అనగా అక్టోబర్‌ 12న కలువా దంపతులు అనుమానం రాకుండా ఉండటం కోసం చిన్నారి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు నెల రోజుల పాటు పోలీసులు దర్యాప్తు చేశారు. ఇసాబెల్లా కోసం వందలాది మంది వలంటీర్లు గాలించారు. చిన్నారి వారి సొంత తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లి ఉంటుందని భావించి.. వైమన ప్రాంతం అంతా గాలించారు.

చిన్నారి అదృశ్యానికి సంబంధించి చిన్న ఆధారం కూడా దొరక్కపోవడంతో పోలీసులు డిటెక్టివ్‌ సాయం కూడా తీసుకున్నారు. విచారణలో భాగంగా ఇసాబెల్లా అక్క  జరిగిన దారుణం గురించి డిటెక్టివ్‌కు వివరించింది. ఈ క్రమంలో పోలీసులు కలువా దంపతుల ఆన్‌లైన్‌ ఆర్డర్‌ హిస్టరీ గురించి చెక్‌ చేయగా కుక్కల బోను ఆర్డర్‌ చేసినట్లు తెలిసింది.
(చదవండి: పిల్లల దత్తత పేరుతో రూ.8.34 లక్షలు వసూలు.. ఆపై)

ఆధారులు అన్ని సేకరించిన హోనలులూ పోలీసు డిపార్ట్‌మెంట్‌ అధికారులు కలువా దంపతులును అరెస్ట్‌ చేశారు. విచారణలో కోర్టు కలువా దంపతులు క్షమాభిక్షకు అనర్హులని తేల్చింది. చిన్నారి కనీసం అనాథశ్రమంలో ఉంటే బతికి ఉండేదని.. ఈ హింస తప్పేదని కోర్టు విచారణ వ్యక్తం చేసింది. కలువా దంపతులు కఠిన శిక్షకు అర్హులని తేల్చింది. 

చదవండి: ఆమెకు గర్భసంచితోపాటు.. ప్రేమ సంచి కూడా ఉంది..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top