ఉత్తర కొరియాకి వ్యాక్సిన్‌లు సరఫరా చేసే ఆలోచన లేదు: యూఎస్‌

6 Lost With Fever Us Says No Plans To Share Vaccine With North Korea - Sakshi

Covid hits North Korea six people Deand With Fever: ఉత్తరకొరియాలో కరోనా కలకలం తర్వాత తాజగా జ్వరంతో బాధపడుతున్న ఆరుగురు చనిపోయారుని శుక్రవారం ప్రకటించింది. వారిలో ఒక వ్యక్తికి కరోనా పరీకలు చేయగా ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ పాజిటివ్‌గా వచ్చింది. ప్రసుత్తం మూడు లక్షల మందికి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. అయితే వారిలో సుమారు 18 వేల మంది కరోనాకి సంబంధించిన లక్షణాలను కనిపించినట్లు పేర్కొంది. ప్రస్తుతానికి 16 వేల మంది చికిత్స పోందుతున్నారని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటి వరకు ఎంతమందికి కరోనా పరీక్షలు నిర్వహించారనేది స్పష్టం చేయలేదు.

దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ యాంటీ-వైరస్ కమాండ్ సెంటర్‌ను సందర్శించి పరిస్థితి గురించి తెలుసుకోవడమే కాకుండా దేశంలో లాక్‌డౌన్‌ని అమలు చేశాడు. శాస్త్రీయ చికిత్సా విధానం ద్వారా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేలా బలోపేతం చేయాలంటూ కిమ్‌ పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా ఆరోగ్య అధికారులు కూడా జ్వరంతో బాధపడుతున్నవారిని సాధ్యమైనంత వరకు వేరుగా ఉంచి చికిత్స అందించడం ప్రారంభించామని, సత్వరమే ఈ మహమ్మారి నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేశారు.

వ్యాక్సిన్‌లు సరఫరా చేసే ఆలోచన లేదు
కరోనా కలకలంతో టెన్షన్‌ పడుతున్న ఉత్తర కొరియాకు వ్యాక్సిన్‌లు పంపే ప్రణాళికలు ఏమి లేవని యూఎస్‌ స్పష్టం చేసింది. గతంలో కోవాగ్జిన్‌కి  చెందిన గ్లోబల్ వ్యాక్సిన్ షేరింగ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విరాళాలను ఉత్తరకొరియా పదేపదే తిరస్కరించిందని తెలిపింది. కానీ ఉత్తరకొరియాకు మానవతా సాయం అందించే అంతర్జాతీయ ప్రయత్నాలకు మాత్రం మద్దుత ఇస్తామని తెలిపింది.

(చదవండి: నార్త్‌ కొరియాలో కరోనా కలకలం.. ఫస్ట్‌ టైమ్‌ మాస్కులో కిమ్‌ జోంగ్‌ ఉన్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top