అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు..ఇద్దరికి తీవ్ర గాయాలు

2 People Injured In Shooting At Gurudwara In US - Sakshi

అమెరికాలో మరోసారి కాల్పులక కలకలం చోటు చేసుకుంది. ఈ మేరకు అమెరికాలోని గురుద్వార్‌లో ఇద్దరు దుండగలు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఐతే ఈ కాల్పులు ద్వేషపూరిత నేరాని సంబంధించినది కాదని చెప్పారు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో చోటు చేసుకుంది.

ఇది తెలిసిన వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న కాల్పుల దాడి అని శాక్రమెంటో కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం పేర్కొంది. కాల్పుల జరగాడానికి ముగ్గురు వ్యక్తుల మధ్య చిన్న ఫైట్‌ జరిగిందని, ఆ తర్వాత అదికాస్త కాల్పులకు దారితీసిందని షెరీష్‌ కార్యాయల ప్రతినిధి అమర్‌ గాంధీ పేర్కొన్నారు. అలాగే అనుమానితుల్లో ఒకరు భారతీయ వ్యక్తి కాగా, మరో అనుమానిత షూటర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, యూఎస్‌లో గతేడాది దాదాపు 44 వేల తుపాకీ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. వాటిలో సగం హత్య కేసులు, మరికొన్ని ప్రమాదాలు, ఆత్మరక్షణ, ఆత్మహత్యలు కారణంగా జరిగినవి.

(చదవండి: అమెరికాలో భారత ఎంబసీపై దాడికి విఫలయత్నం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top