Mexico: బస్సు, ట్రక్కు ఢీ.. 19 మంది మృతి | 19 Killed And 22 Injured After Bus Collides With Truck On Highway In Mexico, Details Inside - Sakshi
Sakshi News home page

Mexico Road Accident Today: బస్సు, ట్రక్కు ఢీ.. 19 మంది మృతి

Jan 31 2024 8:40 AM | Updated on Jan 31 2024 10:13 AM

19 killed Bus Collides With Truck On Highway In Mexico - Sakshi

మెక్సికో: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 19 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారికి వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

lవివరాల ప్రకారం.. ఉత్తర మెక్సికోలోని సినలోవాలో మం‍గళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొనడం వల్ల 19 మంది మృతి చెందగా, మరో 22 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, పసిఫిక్ తీర రాష్ట్రం సినాలోవాలోని జాతీయ రహదారిపై సరుకులను రవాణా చేసే ట్రక్కు, బస్సు ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరగిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. 

ఇక, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement