
ఎన్నిక ఏకగ్రీవమే
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. జీహెచ్‌ఎంసీలో అత్యధిక స్థానాలు కలిగిన బీఆర్‌ఎస్–ఎంఐఎం మధ్య పరస్పర ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ నుంచి ఎనిమిది మంది, ఎంఐఎం నుంచి ఏడుగురికి స్టాండింగ్ కమిటీ పదవులు దక్కాయి. బీఆర్‌ఎస్ నుంచి అదనంగా ఇద్దరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు. చివరిలో ఈ నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైనట్టు కమిషనర్ రోనాల్డ్ రాస్ ప్రకటించారు.
నూతన సభ్యులు వీరే..
బీఆర్‌ఎస్ నుంచి ఆవుల రవీందర్‌రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, కంది శైలజ, చింతల విజయశాంతి, పొడవు అర్చన, బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, మన్నె కవితా రెడ్డి, సబీహ బేగం ఎన్నిక కాగా ఎంఐఎం నుంచి ఎండీ గౌసుద్దీన్, ఫహద్‌బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాత్, ఎండీ ఖదీర్, మహ్మద్ నజీరుద్దీన్, మహ్మద్ ముజఫర్ హుస్సేన్, రఫత్ సుల్తానా, షాహీన్‌బేగం ఎన్నికయ్యారు.
హైదరాబాద్ దారుస్సలాంలో ఏఐఎంఐఎం 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. – సాక్షి, సిటీబ్యూరో