శనివారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2026
కేయూ క్యాంపస్: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో శనివారం 24వ స్నాతకోత్సవం జరగనుంది. యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ప్రత్యేక వేదికను ముస్తాబు చేశారు. విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్య అతిథిగా సైయెంట్ సంస్థ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. 290 మంది అభ్యర్థులకు 408 బంగారు పతకాలు, 88 మందికి పీహెచ్డీ పట్టాలు అందజేస్తారు. స్నాతకోత్సవ ఏర్పాట్లను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం పర్యవేక్షించారు.
అభ్యర్థులకు సూచనలు..
బంగారు పతకాలు అందుకోబోయే అభ్యర్థులు ఉదయం 7 నుంచి 9గంటల వరకు కేయూలోని దూరవిద్యకేంద్రం ద్వారా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలోకి ప్రవేశించి బంగారు పతకాలు స్వీకరించాల్సి ఉంటుంది.
● అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నందున 14 బ్యాచ్‌లుగా చేశారు. ముందుగానే బంగారు పతకాలు స్వీకరించాక వాటిని తీసుకొని ఉదయం 9.20 గంటల్లోపు ఆడిటోరియంలోకి ప్రవేశించి తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి.
● బంగారు పతకాలతోనే బ్యాచ్‌ల వారీగా గవర్నర్‌తో ఫొటో సెషన్ కొనసాగుతుంది.
● పీహెచ్డీ పట్టాలు అందుకునే అభ్యర్థులు కూడా దూరవిద్యాకేంద్రం ద్వారానే ఆడిటోరియంలోకి ప్రవేశించి కేటాయించిన సీట్లలో కూర్చోవాలి.
● వీరికి మాత్రం గవర్నర్ చేతులమీదుగా పీహెచ్డీ పట్టాల ప్రదానం ఉంటుంది.
● అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది కూడా వైట్ డ్రెస్ ధరించి రావాల్సి ఉంటుంది.
గవర్నర్ పర్యటన షెడ్యూల్ ఇలా..
● ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరుతారు.
● 10.30 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్‌కాలేజీ మైదానంలోని హెలిపాడ్‌లో దిగుతారు.
● 10.40 గంటలకు వరంగల్ నిట్ వీఐపీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
● 10.55 గంటలకు బయల్దేరి 11 గంటలకు కేయూ ఆడిటోరియానికి చేరుకుంటారు.
● స్నాతకోత్సవం కార్యక్రమంలో మధ్యాహ్నం 12.45 గంటల వరకు పాల్గొంటారు.
● 12.45 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేయూ గెస్ట్ హౌస్‌లో ఉంటారు. అక్కడే లంచ్.
● మధ్యాహ్నం 2గంటలకు బయల్దేరి ఆర్ట్స్ కాలేజీలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు.
● 2.10 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరుతారు.
పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు
స్నాతకోత్సవం నిర్వహణకు సంబంధిత అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందితో వేసిన 12 కమిటీలు నిర్వహణ చూసుకుంటాయి. యూనివర్సిటీలో నెలకొన్న వివిధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్యాంపస్‌లో, బయట 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశా రు. పాస్‌లు ఉన్నవారినే ఆడిటోరియంలోకి అనుమతిస్తారు.
అతిథులు : రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్శుక్లా,
పద్మశ్రీ బీవీఆర్ మోహన్‌రెడ్డి
పీహెచ్డీ అభ్యర్థులు : 88 మంది
బంగారు పతకాలు : 290 మందికి 408
విభాగాలు : ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, కామర్స్ అండ్
బిజినెస్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, లా, ఇంజనీరింగ్
అండ్ టెక్నాలజీ, ఫార్మసీ, సైన్సెస్
విద్యాసంవత్సరాలు : 2021 నుంచి 2025 వరకు
నేడు కేయూ 24వ స్నాతకోత్సవం
ముస్తాబైన ఆడిటోరియం వేదిక
250మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు


