భవన అనుమతులు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

భవన అనుమతులు ఇలా..

Nov 28 2026 1:44 AM | Updated on Nov 28 2026 1:44 AM

సాక్షి, వరంగల్‌:

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల్లో కొందరు సిబ్బంది పక్కా ‘ప్లానింగ్‌’తో ముందుకెళ్తున్నారన్న ఆరోపణలున్నాయి. పెరుగుతున్న నిర్మాణాలే వీరికి మంచి ఆదాయ వనరుగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. 605 గజాల్లోపు ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ ఇంటి నిర్మాణ అనుమతుల్లో ముందుగానే మొత్తం ఫీజు దరఖాస్తుదారులు చెల్లించడాన్ని వీరు ఆసరాగా చేసుకొని కొందరు ప్లానింగ్‌ సిబ్బంది ఫైల్‌ ప్రాసెస్‌ విషయంలో కాలయాపన చేస్తూ టచ్‌లోకి వచ్చాకే ముందుకెళ్తుండడం వీరికి చేసుకుంటున్నారు. భవన నిర్మాణదారులు అప్పటికే రూ.లక్షల్లో ఫీజులు కట్టి ఉండడంతో, ఇక తిరకాసులు తమ వల్ల కాదని.. రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు సమర్పించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. 605 గజాలు, ఆపైన ఉన్న సింగిల్‌ విండో ఫైల్స్‌ ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు ఉండడంతో విస్తీర్ణం, అంతస్తులను బట్టి రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు చేస్తుండడం చర్చకు దారితీస్తోంది.

నిర్మాణాల జోరు.. అక్రమార్జన హోరు

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఫైల్‌ పరిశీలన, క్షేత్రస్థాయి తనిఖీలు, నిబంధనల పరిశీలన, అనుమతి జారీ వరకు వివిధ దశల్లో ప్లానింగ్‌ సిబ్బంది పాత్ర కీలకం. ఈక్రమంలో కొందరు సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నగరపౌరులు కోరుతున్నారు. అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ ప్లానింగ్‌ విభాగంలో అనుమతుల జారీ ప్రక్రియ, ఫైళ్ల పెండింగ్‌, క్షేత్రస్థాయి తనిఖీలపై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈవిభాగంలోని కొందరు సిబ్బంది ఆదాయ వనరులపై ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తే వసూళ్ల తంతు వెలుగులోకి వచ్చే అవకాశముందని నగరవాసులు కోరుతున్నారు.

సంవత్సరం అనుమతులు

2,508

2025–26

2024–25

2023–24

2022–23

2021–22

2020–21

2019–20

2,943

4,526

3,663

2,541

2,500

బల్దియాలో బిల్డింగ్‌

పర్మిషన్ల దందా

అందినకాడికి దండుకుంటున్న

ఆ విభాగంలోని కొందరు

605 గజాల్లోపు ఓ లెక్క..

దాటిందంటే మరో లెక్క

మామూలుగా చూసుకోకపోతే

వివిధ కారణాలతో కొర్రీలు

ఏసీబీ దృష్టి సారిస్తే అవినీతి

అక్రమాలు వెలుగులోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement