నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ | - | Sakshi
Sakshi News home page

నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ

Nov 28 2026 1:44 AM | Updated on Nov 28 2026 1:44 AM

నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ

హసన్‌పర్తి: సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సమాన తత్సమాన ఉద్యోగాల నియామకాల ప్రిలిమినరీ రాత పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని పోలీస్‌ కమిషనర్‌ శ్వేత శుక్రవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరంగల్‌ రీజియన్‌ పరిధిలో మొత్తం 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, పరీక్ష నిర్వహణ, భద్రతా పర్యవేక్షణ కోసం వాటిని ఆరు రూట్లుగా విభజించినట్లు తెలిపారు. ప్రతీ రూట్‌కు ఏసీపీ స్థాయి అధికారిని నియమించినట్లు చెప్పారు. ఈపరీక్షకు వరంగల్‌ రీజియల్‌ పరిధిలో మొత్తం 18,194 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు.

అభ్యర్థులకు సూచనలు

● అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌పై తమ పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫొటోను అతికించుకుని పరీక్ష కేంద్రానికి తీసుకురావాలి.

● పరీక్షకు బాల్‌ పాయింట్‌ పెన్నులు మాత్రమే వినియోగించాలి.

● అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్‌ నమోదు తీసుకుంటారు. అభ్యర్థుల చేతులపై ఎలాంటి గుర్తులు ఉండకూడదు.

● పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థిని పరీక్షా కేంద్రం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించరు.

● పరీక్ష పూర్తయిన అనంతరం ఓఎంఆర్‌ షీట్‌ను ఇన్విజిలేటర్లకు మాత్రమే అప్పగించాలి.

● హాల్‌టికెట్‌పై ముద్రించిన నిబంధనల్ని అభ్యర్థులు తప్పకుండా పాటించాలి.

● మొబైల్‌ ఫోన్‌, ఎలక్ట్రానిక్స్‌ వాచీలు, కాలిక్యులేటర్లు, డిజిటల్‌ కళ్లాద్దాలు, బంగారు ఆభరణాలు, పర్సులు, వాటర్‌ బాటిళ్లు తదితర వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.

● పరీక్ష కేంద్రాల వద్ద వస్తువులు, భద్రపర్చడానికి ఎలాంటి సదుపాయం లేదు.

ఆరు మైదానాల్లో వాకింగ్‌కు అనుమతి లేదు

ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో ఎగ్జామ్స్‌ సెంటర్ల మైదానాల్లో వాకింగ్‌కు తాత్కాలికంగా అనుమతి ఉండదని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత తెలిపారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు ఆయా మైదానాల్లో వాకర్స్‌ రావొద్దని సూచించారు.

వాకింగ్‌కు అనుమతి లేని మైదానాలివే..

● సెయింట్‌ గ్యాబ్రియల్‌ హైస్కూల్‌, కాజీపేట

● ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, హనుమకొండ

● కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండ

● కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌

● లాల్‌ బహదూర్‌ కళాశాల, వరంగల్‌

● ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, వరంగల్‌

రేపటి ఎస్సై రాత పరీక్షకు పటిష్ట బందోబస్తు

32 పరీక్ష కేంద్రాలు 6 రూట్లు

ప్రతీ రూట్‌కు ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ: సీపీ శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement