సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 31 2026 3:14 AM | Updated on Aug 31 2026 3:14 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

తొలగించండి.. మహాప్రభో

విచారణ జరిపిస్తున్నాం..

నాటి తప్పులతో నగర ప్రజలకు తప్పని ఇబ్బందులు

తొలగించాలని బల్దియా గ్రీవెన్స్‌లో వేలాది ఫిర్యాదులు

పట్టించుకోని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఉన్నతాధికారులు

వరంగల్‌ లేబర్‌ కాలనీలోని 18వ డివిజన్‌లో 16–12–97/1 ఇంటి నంబర్‌కు నల్లా లేదు. కానీ, బిల్లు రూ.12వేలు ఉంది. బిల్లు మాఫీ చేయాలని యజమాని మాధవి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు.

వరంగల్‌ చింతల్‌లోని 16–11–371/1 ఇంటి నంబర్‌లో నల్లా కనెక్షన్‌ లేకున్నా రూ.7వేల బిల్లు వేశారు. బిల్లు రద్దు చేయాలని మహ్మద్‌ రజీయొద్దీన్‌ అధికారులను కోరారు.

వరంగల్‌ అర్బన్‌: ఒకవైపు నల్లా మీటర్లు లేని వాణిజ్యసంస్థలు, అపార్ట్‌మెంట్లు, మరోవైపు అక్రమ కనెక్షన్లతో గ్రేటర్‌ వరంగల్‌ ఆదాయానికి గండి కొడుతున్న జలగలను చూసీచూడనట్లుగా విడిచిపెడుతున్న ఇంజనీర్లు.. ఇంకో వైపు లేని నల్లాలకు మాత్రం బిల్లులు పంపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నాడు మెప్మా రిసోర్స్‌ పర్సన్స్‌ (ఆర్పీలు) చేసిన తప్పిదాలు సరిచేసుకోకుండా.. వారు అనుకున్నదే తడవుగా బిల్లులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో వినియోగదారులు పరేషాన్‌ అవుతున్నారు.

తప్పు ఎక్కడ జరిగింది?

అమృత్‌–01 పథకంలో భాగంగా నగరంలో రూ.630,36 కోట్లు తాగునీటి కోసం కేటాయించారు. 33 ఈఎస్‌ఆర్‌లు, డిస్ట్రిబ్యూషన్‌ పైప్‌లైన్లు, అంతర్గత పైప్‌లైన్లు, వాల్వ్‌లు ఏర్పాటు చేశారు. నగరంలో 50 శాతానికిపైగా కాలనీల్లో పైప్‌లైన్లు నిర్మించారు. గతంలో ఉన్న పైప్‌లైన్లకు నల్లాలు ఉన్నాయి. వాటికి నీటి సరఫరా బంద్‌ చేశారు. అమృత్‌ పైప్‌లైన్లకు కొత్త నల్లాలు పెట్టి, మీటర్లు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కొత్త నల్లా కనెక్షన్ల పైపులైన్లకు బిగించిన నల్లాలు, ఇంటి నంబర్లను క్షేత్రస్థాయిలో వెళ్లి గతంలో నల్లా ఉందా? లేకపోతే కొత్తగా ఏర్పాటు చేశారని పరిశీలించే బాధ్యత మెప్మా ఆర్పీలకు అప్పగించారు. అందుకు కొంత సొమ్ము అందజేసే ఒప్పందం చేసుకున్నారు. కొందరు ఆర్పీలు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నా లేనట్లుగా బల్దియా వెబ్‌సైట్‌లో నల్లా కనెక్షన్లు నమోదు చేశారు. నల్లా కనెక్షన్‌ అసలే తీసుకొని ఇంటి నంబర్లకు, నల్లా ఉన్నప్పటికీ అదనపు కనెక్షన్‌ జోడించారు. ఇళ్లకే కాదు అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లకు నల్లా కనెక్షన్లు ఉన్నట్లు చూపడం దారుణం. దీంతో నగర వ్యాప్తంగా సుమారు 8వేల ఇళ్లకు అదనపు కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. గత ఐదేళ్లుగా కనెక్షన్‌ లేని ఇళ్లకు, ఒక ఇంటి నంబర్‌పై రెండేసి బిల్లుల బకాయిలను లెక్కలతో చూపిస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు.

పనితీరే కొలమానం

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో నల్లా లేకున్నా బిల్లులు

రంగశాయిపేటలోని 19–9–449/2 ఇంటి నంబర్‌కు రెండు నల్లాలు ఉన్నాయి. ఒకదానిని తొలగించాలని దొడ్డ శ్రీనివాస్‌ పలుమార్లు ఇంజనీర్లను వేడుకున్నా స్పందించడం లేదు. బకాయి చార్జీలు నెలనెల వస్తున్నాయి.

నల్లా కనెక్షన్‌ లేదు. బిల్లు రూ.7,200 వేశారని హనుమకొండ లష్కర్‌బజార్‌కు చెందిన విజయలక్ష్మి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదు.

గుండ్లసింగారంలో 39–1–18 ఇంటి నంబర్‌కు నల్లా కనెక్షన్‌ లేకున్నా బిల్లు వస్తోందని మినహాయించాలని రవీందర్‌రెడ్డి కోరారు.

నల్లా కనెక్షన్‌ ఇవ్వకముందే, నల్లా లేకున్నా, ఒక ఇంటికి ఒక కనెక్షన్‌ ఉండగా, అదనపు కనెక్షన్‌ ఇలా.. లేని నల్లాలకు బిల్లులు మంజూరు చేశారని తొలగించండి మహాప్రభో అంటూ వినియోగదారులు బల్దియా ప్రధాన కార్యాలయం గ్రీవెన్స్‌లో ప్రతి వారం పెద్ద ఎత్తున దరఖాస్తులు అందిస్తున్నారు. గతంలో ఉన్న నల్లా కనెక్షన్‌, అదనపు నల్లా, లేని నల్లాలకు బిల్లులు చేస్తే తొలగిస్తామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ కొంతమంది ముందుకొచ్చి బిల్లులు చెల్లించినా కూడా రద్దు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కానీ, బల్దియా ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో విచారణ చేయడంలో తాత్సరం చేస్తున్నారు. లేని కనెక్షన్లు తొలగించాలని సుమారు 4వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతి నెల నల్లా బిల్లు రూ.150 చొప్పన పెరిగి తడిసిమోపెడవుతోంది. కానీ, ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ప్రజలకు శాపంగా మారుతోందని ఆరోపణలు వస్తున్నాయి. లేని నల్లా కనెక్షన్లను తొలగించాలని బల్దియా కమిషనర్‌, ఎస్‌ఈకి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

అదనపు నల్లా కనెక్షన్లు తొలగించాలని దరఖాస్తులు ప్రతివారం అందుతున్నాయి. పెండింగ్‌ దరఖాస్తులను క్లియర్‌ చేయాలని ఆదేశాలిచ్చాను. క్షేత్రస్థాయిలో ఏఈలు, లైన్‌మెన్లు విచారణ చేసి రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటా.

– రాజ్‌కుమార్‌, బల్దియా ఎస్‌ఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement