టీచర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

Aug 31 2026 3:14 AM | Updated on Aug 31 2026 3:14 AM

విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హనుమకొండలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఆదివారం పీఆర్టీయూ టీఎస్‌ హనుమకొండ జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన రూ.14 వేల బిల్లులు చెల్లించాలని, 50 శాతం ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు వివరించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి నివేదికను ప్రవేశపెట్టారు. నివేదికపై చర్చించి సభ్యులు ఆమోదించారు. రాష్ట్ర ఆడిట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, నియమావళి కమిటీ చైర్మన్‌ రేగూరి సుభాకర్‌రెడ్డి, పీఆర్టీయూ ఉమ్మడి జిల్లా బాధ్యులు, ఉపేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పట్టాభి మహేందర్‌, మహిపాల్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, కిరణ్‌, యాకూబ్‌రెడ్డి, తిరునగరి శ్రీనివాస్‌ మహిళా అసోసియేట్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సుమాదేవి, బాధ్యులు అనురాధ మాట్లాడారు.

హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

పీఆర్టీయూటీఎస్‌ హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈ సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఫలిత శ్రీహరి, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల ఉపేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా నల్లగొండ జిల్లా పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు కాలం నారాయణరెడ్డి, మేకల జానారెడ్డి వ్యవహరించారు. జిల్లాలోని 14 మండలాల సంఘం బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రేపు పీఆర్టీయూ మహాధర్నా

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement