తెలంగాణ వారసత్వ శాఖతో కేయూ ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ వారసత్వ శాఖతో కేయూ ఎంఓయూ

Jan 18 2026 8:08 AM | Updated on Jan 18 2026 8:08 AM

తెలంగ

తెలంగాణ వారసత్వ శాఖతో కేయూ ఎంఓయూ

తెలంగాణ వారసత్వ శాఖతో కేయూ ఎంఓయూ వేయిస్తంభాల దేవాలయంలో మాసశివరాత్రి పూజలు క్రీడలతో సన్మార్గం

కేయూ క్యాంపస్‌ : తెలంగాణ ప్రభుత్వ వారసత్వ శాఖ (హెరిటేజ్‌ డిపార్ట్‌మెంట్‌), కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ విభాగం మధ్య శనివారం హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌ రంజన్‌, కేయూ వీసీ ప్రొఫెసర్‌ కె.ప్రతాప్‌రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.రామచంద్రం, రాష్ట్ర హెరిటేజ్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అర్జున్‌ రావు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి.మనోహర్‌, హిస్టరీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ విభాగం అధిపతి డాక్టర్‌ చిలువేరు రాజ్‌కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరాజు, ఓఎస్డీ రాజు పాల్గొన్నారు.

ఎంఓయూతో ప్రయోజనాలు ఇలా..

తెలంగాణలో అతిథ్యం, పర్యాటక రంగాలకు విస్తృత అవకాశాలున్న నేపథ్యంలో ఈ అవగాహన ఒప్పందం ద్వారా ఇరు సంస్థలకు ప్రయోజనం కలగనుంది. ఎంఓయూ ద్వారా విద్యార్థులకు పురావస్తు ప్రదేశాలు, మ్యూజియంలు, వారతస్వ కట్టడాలపై ప్రత్యక్ష అనుభవం లభించనుంది. అలాగే ఇంటర్నెషిప్‌నకు అవకాశాలు లభించనున్నాయి.

హన్మకొండ కల్చరల్‌: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శనివారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠ అవధాని, అర్చకులు ప్రణవ్‌, సందీప్‌శర్మ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి ఆరాధన గరికపూజ, శ్రీరుద్రేశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. అనంతరం నాట్యమండపంలో శ్రీరుద్రేశ్వరీదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారిని ప్రతిష్ఠించి కలశస్థాపన, బాసికధారణ, యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి కల్యాణోత్సవం నిర్వహించారు.

కాజీపేట అర్బన్‌ : యువతకు క్రీడా స్ఫూర్తిని కల్పించేందుకు, మత్తు పదార్థాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడిపేందుకు క్రీడలు తోడ్పడుతాయని తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఆయిల్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ జంగా రాఘవ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని టేకులగూడెంలో ఏర్పాటు చేసిన జాతీయ ఖోఖో చాంపియన్‌ షిప్‌ సక్సెస్‌ మీట్‌లో రాఘవరెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, ఇందుకు రూ.300 కోట్లను కేటాయించడమే నిదర్శనమని అన్నారు. నేషనల్‌ ఖోఖో చాంపియన్‌ షిప్‌ విజయవంతానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఖోఖో చాంపియన్‌ షిప్‌లో 1,500 మంది క్రీడాకారులు, 500 మంది కోచ్‌లు పాల్గొనగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోటీల్లో పాల్గొని క్షేమంగా ఇంటికి చేరే వరకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.రాబోయే రోజుల్లో ఉనికిచర్ల గ్రామంలో నిర్మించనున్న స్టేడియం క్రీడలకు కేంద్రంగా మారనుందని పేర్కొన్నారు. మరిన్ని జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు వేదికగా ఓరుగల్లును తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు.

ఇంటర్‌ అనుబంధ

పరీక్షల సామగ్రి పంపిణీ

కాళోజీ సెంటర్‌ : ఇంటర్‌ అనుబంధ పరీక్షల సామగ్రిని ఈనెల 19వ తేదీలోపు అన్ని యాజ మాన్య కళాశాలలు తీసుకెళ్లాలని వరంగల్‌ డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ సూచించారు. ఈ మేరకు ఆయా కళాశాలల సిబ్బందికి పరీక్షల సామగ్రిని శనివారం పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 66 కళాశాలల్లో ప్రథమ సంవత్సరం జనరల్‌ కోర్సుల్లో 5,386 మంది, ఒకేషనల్‌ కోర్సుల్లో 839 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ కోర్సుల్లో 4,977, ఒకేషనల్‌ కోర్సుల్లో 855 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. 21న ప్రథమ సంవత్సరం, 22న ద్వితీయ సంవత్సరం ఆంగ్లం ప్రాక్టికల్స్‌ ఉంటాయని, 23న నైతిక, మానవ విలువలు, 24న పర్యావరణ పరీక్షలు ఉంటాయని, ఇంటర్‌ బోర్డు గుర్తింపు పొందిన అన్ని కళాశాలలు ఈ పరీక్షలు నిర్వహించాలని శ్రీధర్‌ సుమన్‌ సూచించారు.

తెలంగాణ వారసత్వ శాఖతో  కేయూ ఎంఓయూ1
1/2

తెలంగాణ వారసత్వ శాఖతో కేయూ ఎంఓయూ

తెలంగాణ వారసత్వ శాఖతో  కేయూ ఎంఓయూ2
2/2

తెలంగాణ వారసత్వ శాఖతో కేయూ ఎంఓయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement