మున్సి‘పోల్స్‌’లో నిర్ణేతలు మహిళలే | - | Sakshi
Sakshi News home page

మున్సి‘పోల్స్‌’లో నిర్ణేతలు మహిళలే

Jan 14 2026 7:06 AM | Updated on Jan 14 2026 7:06 AM

మున్సి‘పోల్స్‌’లో నిర్ణేతలు మహిళలే

మున్సి‘పోల్స్‌’లో నిర్ణేతలు మహిళలే

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన నారీమణులు.. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ నిర్ణేతలుగా నిలవనున్నారు. ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా డిసెంబర్‌ 11, 14, 17.. మూడు తేదీల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పురుషులకంటే 1.09 లక్షల మంది మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండు రోజుల కిందట రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీల వారిగా ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలోనూ భూపాలపల్లి మినహా అంతటా వారిదే ఆధిక్యం ఉంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 3,35,244 మంది ఓటర్లుండగా.. అందులో మహిళలు 1,72,087లు కాగా, పురుషులు 1,63,088.

త్వరలోనే నోటిఫికేషన్‌..?

రిజర్వేషన్‌లపైనే అందరి దృష్టి..

మున్సిపల్‌ ఎన్నికలకు జనవరి 20వ తేదీ వరకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. ఇందుకు ఊతమిచ్చేలా ఈ నెల 16నుంచి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు జిల్లాల వారీగా సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌లోని 12 మున్సిపాలిటీల్లో ఏ మున్సిపాలిటీ ఏ సామాజికవర్గానికి రిజర్వ్‌ అవుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రధాన పార్టీలనుంచి వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులు ఆశిస్తున్న వారి దృష్టి రిజర్వేషన్‌లపైనే ఉంది. కాగా, ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను నిర్వహిస్తుండగా.. తాజాగా వెనుకబడిన తరగతుల (బీసీ) డెడికేటెడ్‌ కమిషన్‌, తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలుస్తోంది. మొత్తం 50 శాతం రిజర్వేషన్లలో, షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్‌సీ), షెడ్యూల్డ్‌ తెగల (ఎస్‌టీ) రిజర్వేషన్లు కలిపి సుమారు 15 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది, మిగిలిన వాటాను వెనుకబడిన తరగతులకు కేటాయించాలని కమిషన్‌ సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌ల అంశం రెండు రోజుల్లో తేలే అవకాశం ఉందన్న ప్రచారం కూడా తెరపైకి వచ్చింది.

వేడెక్కిన రాజకీయం..

త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా వెలువడనుందన్న ప్రచారం జోరందుకోవడంతో మున్సిపాలిటీ రాజకీయాలు వేడెక్కాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వార్డుల వారీగా దావత్‌లు, పలకరింపులతో ఆశావహులు హంగామా చేస్తున్నారు. ఈ నెల 20న నోటిఫికేషన్‌ కూడా వెలువడుతుందన్న ప్రచారం బలంగా సాగుతుండటంతో ప్రధాన పార్టీల నుంచి వార్డు కౌన్సిలర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులు ఆశిస్తున్న వారు ముఖ్యనేతలకు రోజూ టచ్‌లో ఉంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల ఆశావహలు నిమగ్నం అయ్యారు.

మున్సిపాలిటీల ఓటర్లలో ఆధిక్యం..

భూపాలపల్లి మినహా 11చోట్ల వారే

12 మున్సిపాలిటీల్లో 3.35 లక్షల మంది ఓటర్లు..

మహిళ ఓటర్లు 1,72,087

రిజర్వేషన్‌ల వైపు అందరి చూపు..

త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌..? వేడెక్కిన రాజకీయం

మున్సిపాలిటీలు 12

వార్డులు 260

మొత్తం ఓటర్లు 3,35,244

పురుషులు 1,63,088

సీ్త్రలు 1,72,087

ఇతరులు 69

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అయా మున్సిపాలిటీల్లో వార్డులు, ఓటర్ల సంఖ్య

జిల్లా మున్సిపాలిటీ వార్డుల మొత్తం పురుషులు సీ్త్రలు ఇతరులు

సంఖ్య ఓటర్లు

హనుమకొండ పరకాల 22 26,784 12,937 13,847 00

వరంగల్‌ నర్సంపేట 30 40,968 19,642 21,323 03

వర్ధన్నపేట 12 10,526 5,109 5416 01

జనగామ జనగామ 30 44045 21,358 22,678 09

స్టేషన్‌ఘన్‌పూర్‌ 18 18,550 8913 9,636 01

భూపాలపల్లి భూపాలపల్లి 30 52,726 26,786 25,936 04

మహబూబాబాద్‌ మహబూబాబాద్‌ 36 65,712 31,550 34,121 41

డోర్నకల్‌ 15 10,869 5,160 5,709 00

కేసముద్రం 16 15,963 7,762 8,201 00

మరిపెడ 15 13,687 6,709 6,978 00

తొర్రూరు 16 21,451 10,501 10,942 08

ములుగు ములుగు 20 13,963 6,661 7,300 02

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement