ఖోఖోలో మహారాష్ట్ర, రైల్వేస్ ముందంజ..
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్‌షిప్‌లో రైల్వేస్, మహారాష్ట్ర ముందంజలో కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మహిళల డిపెండింగ్ చాంపియన్ మహారాష్ట్ర 44–10 స్కోర్ తేడాతో ఉత్తరప్రదేశ్‌పై, పురుషుల డిఫెండింగ్ చాంపియన్‌షిప్ రైల్వేస్ 39–12 స్కోర్ తేడాతో పుదుచ్చేరిపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. మహిళల విభాగంలో 23–4 తేడాతో హరియాణపై కొల్లాపూర్, 26–21తో కేరళపై గుజరాత్, 27–18తో పశ్చిమ బెంగాల్‌పై కర్ణాటక, 19–12తో ఆంధ్రప్రదేశ్‌పై తమిళనాడు, 30–18తో విదర్భపై ఒడిశా, 25–12తో పంజాబ్‌పై ఎయిర్‌పోర్టు అఽథారిటీ ఆఫ్ ఇండియా, 35–16 తేడాతో రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపొంది ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి.
పురుషుల విభాగంలో..
24–19 తేడాతో అతిథ్య తెలంగాణపై కర్ణాటక గెలుపొందింది. తొలి అర్ధభాగంలో కర్ణాటక 15–9 స్కోరు సాధించింది. కర్ణాటక జట్టులోని జి.సునీల్ 2.30 టైమింగ్ ఇవ్వడమే కాకుండా నాలుగు పాయింట్లు సాధించాడు. తెలంగాణ జట్టులోని టి.నిరీక్షణ్, 2.40, జైకుమార్ 1.40, జి.దినేశ్ 50 సెకండ్స్ ఆడారు. కెప్టెన్ రాకేశ్ సైతం 4 పాయింట్లు చేజింగ్‌లో సాధించాడు. క్వార్టర్ ఫైనల్‌లో తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్‌తో తలపడింది. మిగతా లీగ్ మ్యాచ్‌ల్లో 28–23 తేడాతో ఢిల్లీపై కేరళ , 27–21తో ఛత్తీస్‌గఢ్‌పై పశ్చిమ బెంగాల్, 28–25తో తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్, 24–15తో ఉత్తరప్రదేశ్‌పై మహారాష్ట్ర , 29–22తో గుజరాత్‌పై కొల్లాపూర్, 25–11తో విదర్భపై ఒడిశా విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి.
ముగిసిన మహిళల పోరాటం..
జాతీయ సీనియర్ ఖోఖో చాంపియన్‌షిప్‌లో అతి థ్య తెలంగాణ మహిళల జట్టు పోరాటం ముగిసింది. క్రీడాకారుల సమన్వయ లోపం, కీలక దశలో రాణించకపోవడంతో లీగ్ దశలో నిష్క్రమించింది. గ్రూప్ ‘డి’ విభాగంలో మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడిన తెలంగాణ కేవలం ఒక మ్యాచ్ గెలిచింది. మంగళవారం ఉదయం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 36–4 స్కోరు సహా ఇన్నింగ్స్ తేడాతో తెలంగాణ మహిళల జట్టు విజయం సాధించింది. జట్టులోని కె.రుక్మిణి డిపెండింగ్‌లో 4–10 టైమింగ్ ఇవ్వడమే కాకుండా రెండు పాయింట్లు సాధించింది. కె.మహేశ్వరి రెండు టర్న్‌లలో 3.30, 2.50, ఎం.శ్రీలక్ష్మి 3,.30 టైమింగ్ ఇచ్చారు. అంతకుముందు తెలంగాణ రాజస్థాన్‌తో 202–22 స్కోరుతో కేవలం రెండు పాయింట్లు తేడాతో ఓటమి పొందింది. ఈ మ్యాచ్‌లో అఖిల రెండు మార్లు 2.30 టైమింగ్ ఇవ్వగా, అనూష 8 పాయింట్లు సాధించడం విశేషం. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 14–21 తేడాతో పరాజయమైంది. ఈ మ్యాచ్‌లో అఖిల 2.20, శ్రీలక్ష్మి 2.20 టైమింగ్ ఇవ్వగా అనూష రెండు పాయింట్లు సాధించింది. భారత ఖోఖో సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉప్కార్ సింగ్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగా రాఘవరెడ్డి, నాతి కృష్ణమూర్తి, హనుమకొండ, హైదరాబాద్ జిల్లాల క్రీడల యువజన శాఖ అధికారులు గుగులోత్ అశోక్‌కుమార్, నడిపల్లి సుధాకర్‌రావు, సీనియర్ ఖోఖో కోచ్ యతిరాజ్, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.
లీగ్‌ల్లోనే నిష్క్రమించిన తెలంగాణ మహిళల జట్టు
నేడు క్వార్టర్ ఫైనల్
ఖోఖోలో మహారాష్ట్ర, రైల్వేస్ ముందంజ..


