నర్సరీ సాగు.. బహుబాగు
● ఆదర్శంగా నిలుస్తున్న బండి శ్రీనివాస్
సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లికి చెందిన రైతు బండి శ్రీనివాస్ సేంద్రియ పద్ధతిలో వైవిధ్య పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చాలా మంది రైతులు సంప్రదాయ పంటలు పత్తి, మొక్కజొన్న, వరి మాత్రమే సాగు చేస్తుండగా అందుకు భిన్నంగా శ్రీనివాస్ సేంద్రియ పద్ధతిలో వైవిధ్య పంటలు కూరగాయలు, సీతాఫలం, కీరదోస, వేరుశనగ, అపరాల్లో కంది, పెసర, బొబ్బెర, సజ్జలు సాగు చేస్తున్నాడు. ఈ పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎక్కువ ధర లభిస్తోంది. సేంద్రియ సాగు కోసం ఆవులు, గేదెలను పెంచుతూ వాటి ఎరువుతోచీడపీడల నివారణ చేస్తున్నట్లు రైతు శ్రీనివాస్ తెలిపారు.
డోర్నకల్: మహబూబాబాద్ జిల్ల డోర్నకల్ మండలం ముల్కలపల్లికి చెందిన రైతు బొమ్మగాని నర్సింహరావు సాగులో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. తెట్టెపాడుకు చెందిన నర్సింహారావు ముల్కలపల్లిలో ఇరువై ఏళ్లుగా నర్సరీ నిర్వహిస్తూ కూరగాయలు పండిస్తున్నాడు. సీజన్ ప్రారంభంలో కూరగాయల మొక్కలు పెంచి రైతులకు విక్రయిస్తున్నాడు. అనంతరం మిగతా కాలమంతా కూరగాయలు పండిస్తున్నాడు. కీరా, చిక్కుడు, టమాటా, సొర, బోడకాకరకాయ, తదితర కూరగాయలు సాగు చేస్తున్నాడు. మొక్కలకు ప్రత్యేక ట్రీగార్డు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ఎలాంటి పురుగు మందులు వాడకుండా (సేంద్రియ) అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. దీంతో జిల్లా వ్యవసాయ అధికారులు నర్సింహారావును అభినందించారు.
ఆధునిక పద్ధతితో అధిక దిగుబడి సాధిస్తున్ననర్సింహారావు..
నర్సరీ సాగు.. బహుబాగు
నర్సరీ సాగు.. బహుబాగు


