పూలే, బుద్ధుడి విగ్రహాలు చైతన్యానికి ప్రతీకలు
● ప్రజాకవి,
వాగ్గేయ కారుడు జయరాజ్
పాలకుర్తి టౌన్ : సమాజంలో సమానత్వం, విద్య, మానవత్వ విలువలు పెంపొందించేందుకు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, గౌతమా బుద్ధుడి ఆలోచనలు మార్గదర్శకాలని ప్రజాకవి, వాగ్గేయ కారుడు జయరాజ్ అన్నారు. మంగళవారం మండలంలోని మల్లంపల్లిలో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయిపూలే విగ్రహాలను అరుణోదయ విమలక్క, రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, గాయకుడు ఏపూరి సోమన్న , డాక్టర్ జిలుకర శ్రీనివాస్, తిరునహరి శేషుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం చెరిపెల్లి ఆనంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జయరాజ్ మాట్లాడుతూ గౌతమా బుద్ధుడు, జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలు కేవలం రాతి రూపాలు కావని, చైతన్యానికి ప్రతీకలన్నారు. పెట్టుబడిదారులు, పాలకులు ప్రకృతిని ఽధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పాలకుర్తి పోరాటాల గడ్డ అన్నారు. మల్లంపల్లిలో మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పోశాల వెంకన్న, తెలంగాణ శ్యాం, మచ్చ దేవేందర్, గుమ్మడిరాజుల సాంబయ్య,సాయిని నరేందర్, సుంకరి భిక్షపతి, బైరపాక జయాకర్, గంధం శివ, వీరదాసు వెంకటరత్నం, చింతం అశోక్, గిరగాని అజయ్, వంగాల సోమయ్య, గంగారపు విజయ్‌కుమార్, కొండ్రాతి సంపత్, పుర్మ రఘుపాల్‌రెడ్డి, పోశాల పవన్, చిట్యాల సంధ్యారాణి పాల్గొన్నారు.


