పోలీస్‌శాఖలో కోవర్టులున్నారు.. | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌శాఖలో కోవర్టులున్నారు..

Jun 20 2025 5:18 AM | Updated on Jun 20 2025 5:18 AM

పోలీస్‌శాఖలో కోవర్టులున్నారు..

పోలీస్‌శాఖలో కోవర్టులున్నారు..

రామన్నపేట: పోలీసు శాఖలోనే కోవర్టులు ఉన్నారని, అది పోలీసు కమిషనర్‌ గుర్తించాలని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సూచించారు. గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌ పోచమ్మమైదాన్‌ జంక్షన్‌లో భారీ కేక్‌ కట్‌ చేశారు. ఈసందర్భంగా మురళి మాట్లాడుతూ.. బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొండా మురళి ఉన్నంత వరకు తూర్పులో రెండో నాయకుడు ఉండరని, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానన్నారు. ‘ఆపరేషన్‌ కగార్‌’ను నిలిపేయాలని ఆందోళనలు చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. బీసీ కులాల్లో తనకు రెండు కులాలకు చెందిన పద్మశాలీ, కాపు కులస్తుల మద్దతు పూర్తిస్థాయిలో ఉంటుందన్నారు. అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్‌, జారతి రమేశ్‌, కొత్తపల్లి శ్రీనివాస్‌, సకినాల రజనీకాంత్‌, బస్వరాజు కుమారస్వామి, పోశాల పద్మ, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గుర్తించాలి

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement