నగర యువకుడి ట్వీట్‌కు కేటీఆర్‌ రియాక్షన్‌ | - | Sakshi
Sakshi News home page

నగర యువకుడి ట్వీట్‌కు కేటీఆర్‌ రియాక్షన్‌

Aug 29 2023 1:06 AM | Updated on Aug 29 2023 10:59 AM

- - Sakshi

హన్మకొండ: ‘హైదరాబాద్‌లోని బన్సీలాల్‌ మెట్లబావి సుందరీకరణ చాలా బాగుంది. మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. వరంగల్‌ నగరంలోని కాకతీయుల మెట్లబావిని పునరుద్ధరించండి. ఈ ప్రాంతం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతంగా గుర్తింపు పొందుతుంది’ అని నగరానికి చెందిన తోట మహేశ్‌ అనే సామాజిక కార్యకర్త ట్విట్టర్‌లో ఐటీ మంత్రి కేటీఆర్‌కు విన్నవించాడు.

దీనికి కేటీఆర్‌ స్పందించి బావి దగ్గరికి అధికారులను పంపించి పరిశీలించాలని, ఆధునికీరణకు పనులు చేపట్టాలని, ఇందుకు బల్దియా సహకారం తీసుకోవాలని ట్యాగ్‌ చేస్తూ సమాధానం ఇచ్చారు. దీనిపై కలెక్టర్‌ ప్రావీణ్య కూడా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో ఆ యువకుడు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement