మలివిడత పల్లెపోరుకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

మలివిడత పల్లెపోరుకు సిద్ధం

Nov 29 2026 1:53 PM | Updated on Nov 29 2026 1:53 PM

మలివిడత పల్లెపోరుకు సిద్ధం

నేడు సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్‌ ఎన్నికల విధుల్లో 763 మంది సిబ్బంది 400 మంది పోలీసులతో బందోబస్తు

తెనాలి టౌన్‌: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. తెనాలి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో ఆదివారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. డివిజన్‌లో మొత్తం 75 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు ఉండగా 17 ఏకగ్రీవమయ్యాయి. 59 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. తెనాలి మండలంలో జరిగే పంచాయతీ రెండో విడత ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎన్నికల ప్రత్యేకాధికారి డి.దుర్గాబాయి తెలిపారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో పోలింగ్‌ సిబ్బందికి శనివారం సామగ్ర పంపిణీ చేశారు. పోలింగ్‌ విధులకు 763 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. 212 మంది పీవోలు, 42 మంది రిజర్వ్‌ పీవోలు 406 మంది ఓపీవోలు, 83 మంది రిజర్వ్‌ ఓపీవోలను కేటాయించినట్లు చెప్పారు. అదే విధంగా 20 మంది మెక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 18 గ్రామ పంచాయతీలకుగాను బుర్రిపాలెం పంచాయతీ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 17 చోట్ల పోలింగ్‌ జరగనుందని చెప్పారు. 17 సర్పంచ్‌, 149 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నదని వెల్లడించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ ఉంటుందని తెలిపారు. సర్పంచ్‌ పదవికి 50 మంది, వార్డు సభ్యుల పదవికి 324 మంది బరిలో ఉన్నట్లు వివరించారు. వార్డు సభ్యుల స్థానాలు మొత్తం 208 ఉండగా.. 59 ఏకగ్రీవం అయ్యాయి. 149 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. 212 పోలింగ్‌ కేంద్రాల్లో అత్యంత సమస్యాత్మకంగా కొలకలూరు, కఠెవరం, జగ్గడిగుంటపాలెం ఉన్నట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలు 152 ఉన్నట్లు చెప్పారు. మండలాన్ని 8 జోన్లు, 14 రూట్లుగా విభజించి పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. సిబ్బందికి అవసరమైన మెటిరియల్‌ ఇచ్చి బస్సుల్లో కౌంటింగ్‌ కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కేవీ గోపాలకృష్ణ, ఎంపీడీవో అత్తోట దీప్తి, డెప్యూటీ ఎంపీడీవోలు వైవీడీ ప్రసాద్‌, రామ్‌కుమార్‌, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ ఎ.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

కొల్లిపర మండలంలో...

కొల్లిపర: మండల పరిధిలో 20 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే మూడు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 17 పంచాయతీలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. 17 పంచాయతీల సర్పంచ్‌ స్థానాలకు 45 మంది అభ్యర్థులు, 170 వార్డులకు గాను 339 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కొల్లిపర మండలానికి సంబంధించి స్థానిక అవుతురామిరెడ్డి జూనియర్‌ కళాశాలలో సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేసి పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని ఎన్నికల రిటరింగ్‌ అధికారి, ఎంపీడీవో విజయలక్ష్మి పరిశీలించారు. హాజరైన 520 సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

చేబ్రోలు మండలంలో...

చేబ్రోలు: పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్లు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి పి. ఊహారాణి తెలిపారు. చేబ్రోలులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో చేబ్రోలు, నారాకోడూరు, వడ్లమూడి, శేకూరు గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 9 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 20 మంది బరిలో ఉన్నారు. మొత్తం 154 వార్డులకుగాను 55 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 99 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 114 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 360 మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఐదు రూట్లు, ముగ్గురు జోనల్‌ అధికారులు విధులు నిర్వహించనున్నారు. చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లారు.

మండలం పంచాయతీలు ఏకగ్రీవం ఎన్నికలు వార్డులు ఏకగ్రీవం ఎన్నికలు

జరిగేవి జరిగేవి

తెనాలి 18 1 17 208 59 149

కొల్లిపర 20 3 17 200 30 170

పొన్నూరు 24 8 16 230 105 125

చేబ్రోలు 13 4 9 154 55 99

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement