సమ సమాజ స్థాపనకు పూలే కృషి | - | Sakshi
Sakshi News home page

సమ సమాజ స్థాపనకు పూలే కృషి

Nov 29 2026 1:53 PM | Updated on Nov 29 2026 1:53 PM

సమ సమాజ స్థాపనకు పూలే కృషి

గుంటూరు ఎడ్యుకేషన్‌: సమ సమాజ స్థాపన కోసం మహాత్మా జ్యోతిరావ్‌ పూలే విశేష కృషి చేశారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావ్‌ పూలే వర్ధంతి సందర్భంగా బృందావన్‌ గార్డెన్స్‌లోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పూలే సమాజానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ముఖ్యంగా 136 ఏళ్ల క్రితం మహిళల స్థితిగతులు, వారి పరిస్థితులు ఏ విధంగా ఉండేవో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. విద్యతోనే మహిళలు అభివృద్ధి బాట పడతారని నమ్మి సమాజంలో చైతన్యాన్ని తెచ్చారని అన్నారు. వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ మహిళలకు విద్య అవసరాన్ని చాటి, అట్టడుగు వర్గాల వారిలో పూలే చైతన్యాన్ని నింపారని అన్నారు. మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు వారి కోసం ప్రత్యేకంగా విద్యాలయాలను స్థాపించే దిశగా తన సతీమణి సావిత్రి బాయి పూలేను ప్రోత్సహించిన తీరు అసామాన్యమన్నారు. అట్టడుగు వర్గాలకు రాజకీయ అధికారం కల్పించేందుకు 150 ఏళ్ల క్రితమే సమ సమాజ స్ధాపన కోసం నడుం బిగించారని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి, కార్పొరేటర్లు మాదాసు ఉషారాణి, దొప్పల వినోదరాణి, ఫారూక్‌ మొహమ్మద్‌, షేక్‌ అమీనా బేగం, షేక్‌ ఫిరోజ్‌, షేక్‌ సమీవుల్లా బేగ్‌, దాసరి నాగరాజు, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగు నరసింహారావు చౌదరి, అనుబంధ విభాగాల నాయకులు చింతపల్లి వెంకటరమణ, కొల్లూరు శివప్రసాదరావు, గనిక ఝాన్సీ, స్వర్ణలత, అంగడి శ్రీనివాసరావు, వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement