పొన్నూరు: స్థానిక చింతలపూడి ఇంజినీరింగ్ కళాశాలలోని కేంద్రంలో శనివారం సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. ఆర్ఓ వి. విజయలక్ష్మి ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సహాయ ఎన్నికల అధికారి గుమ్మా చంద్రశేఖరరావు మాట్లాడుతూ మండలంలోని మొత్తం 24 పంచాయతీల్లో 8 పంచాయతీలకు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. మిగిలిన 16 చోట్ల 47 మంది పోటీలో ఉన్నారని తెలిపారు. 230 వార్డులు ఉండగా, 105 వార్డులు ఏకగ్రీవమయ్యాయని పేర్కొన్నారు. మిగిలిన 125 చోట్ల పోలింగ్ జరగనుండగా, 266 మంది బరిలో ఉన్నారని తెలిపారు. పోలింగ్ విధుల్లో పీఓలు 184 మంది, ఓపీఎస్లు 206 మంది, అబ్జర్వర్లు 20 మంది పాల్గొననున్నారని తెలిపారు.


